Fish : బీ కేర్‌ఫుల్.. చేపలు తింటే ఈ వ్యాధుల బారిన పడే చాన్సెస్..
Fish : చేపలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలతో పాటు ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది చేపలు తినడం అలవాటు చేసుకున్నారు. చేపలు తినడం వలన కంటికి మంచి జరగడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తున్నారు. అయితే, చేపల వలన ఈ వ్యాధుల బారిన పడే చాన్సెస్ కూడా ఉన్నాయని తేలింది. ఏ వ్యాధులంటే..అతి ఎప్పుడైనా చేటు చేస్తుందన్న సంగతి అందరికీ విదితమే. ఈ విషయం చేపలకూ వర్తిస్తుంది. చేపలను అతిగా తీసుకోవడం వలన శరీరానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ఎందుకంటే .. చేపలు నీటిలో ఉంటాయి.
కాగా, నీరు ఇటీవల కాలంలో బాగా కలుషితమవుతున్నది. అలా చేపల కడుపులోకి పదరసం, ఇతర రసాయనాలు ఇమిడిపోయి ఉంటాయి. అలా అవి ఉన్న క్రమంలోనే మనం మన కడుపులోకి ఆహార పదార్థంగా పంపిస్తుంటాం. దాంతో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తొచ్చు. చేపల వలన ముఖ్యంగా మెదడుపైన ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.మెదడుపైన, మానవుడి నాడీ వ్యవస్థపైనఈ వ్యాధుల బారిన చూపుతాయి. ఈ నేపథ్యంలోనే చేపలను తీసుకునే క్రమంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపలు అతిగా తినడం వలన మతి మరుపు వచ్చే అవకాశాలూ ఉన్నాయి.
Fish : ఈ విషయాలు పలు అధ్యయనాల్లో నిరూపితం..
కావున లిమిట్ గానే చేపలను తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. చేపలు అతిగా తీసుకోవడం వలన గర్భిణులపైన తీవ్రమైన ప్రభావాలుంటాయని వైద్యులు వివరిస్తున్నారు. గర్భిణులు చేపలు తీసుకుంటే కనుక అది తల్లి, బిడ్డ ఇద్దరిపైనా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఇకపోతే చేపలు తినే ముందర వైద్యులను సంప్రదిస్తే మంచిదని, వారి కున్న స్పెసిషిక్ కండీషన్స్ మేరకు వాటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. చేపలు ఎక్కువగా తినే వారిలో శరీరంలో రకరకాల మార్పులు జరిగి, వారు కేన్సర్ బారిన పడే చాన్సెస్ కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది.