Fish | చేపలు తినేటప్పుడు ఈ ఆహార పదార్థాలను స్కిప్ చేయండి.. లేకపోతే ఆరోగ్య సమస్యలు తథ్యం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fish | చేపలు తినేటప్పుడు ఈ ఆహార పదార్థాలను స్కిప్ చేయండి.. లేకపోతే ఆరోగ్య సమస్యలు తథ్యం

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2025,8:00 am

Fish | చేపలు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. చేపల కూర, వేపుడు ఇలా చెప్పుకుంటేనే నోరూరిపోతుంది. అయితే చేపలతో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా తినటం వలన జీర్ణ సమస్యలు మాత్రమే కాక, కాలేయం, గుండె సంబంధిత సమస్యల వరకు వెళ్లొచ్చు.

#image_title

1. ఆల్కహాల్

చేపల వేపుడుతో బీరు, వైన్ లేదా ఇతర మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును మానుకోవాలి. ఆల్కహాల్‌ను చేపలతో కలిపి తినడం వల్ల కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. పైగా, కొన్ని అధ్యయనాల ప్రకారం ఇలా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

2. నిమ్మకాయ లేదా విటమిన్-C పండ్లు

పాత చేపలతో పాటు ఎక్కువ పరిమాణంలో నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను తినడం ఆర్సెనిక్ విషం ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది “చేపల పాయిజన్” అనే స్థితికి దారితీయొచ్చు. అయితే తక్కువ పరిమాణంలో విటమిన్ C తీసుకోవడం పెద్దగా హానికరం కాదు.

3. ఆకుకూరలు

పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను చేపలతో కలిపి తినడం వల్ల శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేదు. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట లాంటి సమస్యలు రావచ్చు.

4. ఫాస్ట్ ఫుడ్స్ & ఫ్రైడ్ ఐటమ్స్

చేపలతో పాటు బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలు తీసుకోవడం జీర్ణక్రియను మందగించేస్తుంది. దీనివల్ల కడుపు సమస్యలతో పాటు, కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది.

5. తీపి పదార్థాలు (స్వీట్స్)

చేపలు తిన్న వెంటనే తీపి పదార్థాలు తినడం శరీరంలోని షుగర్ లెవెల్స్‌ను అధికంగా పెంచుతుంది. దీని వల్ల మధుమేహం, బరువు పెరగడం, జీవక్రియలో సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది