EGGS | కోడి గుడ్డుతో ఇవి అస్సలు తినొద్దు..! లేదంటే ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్న నిపుణులు

Authored By Sam C | The Telugu News | Published on: November 3, 2025, 9:44 am

EGGS | ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కోడి గుడ్డు. ప్రతిరోజూ ఒక ఎగ్ తినడం వలన శరీరానికి అవసరమైన విటమిన్ D, అమైనో ఆమ్లాలు, ఓమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, కొన్ని ఆహారాలతో కలిపి గుడ్డు తింటే మాత్రం శరీరానికి హానికరమవుతుందని పోషక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కోడి గుడ్డుతో కలిపి తినకూడని ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

#image_title

1. చేపలతో గుడ్డు తినకూడదు

చేపలు తిన్న రోజున గుడ్డు తినకూడదంటున్నారు నిపుణులు. ఇవి రెండూ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు కావడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పెరుగుతుంది.

2. గుడ్డు తిన్న వెంటనే టీ తాగరాదు

గుడ్డు తిన్న తర్వాత వెంటనే టీ తాగడం తప్పు అంటున్నారు వైద్యులు. టీ లోని టానిన్స్ గుడ్డులోని ప్రోటీన్లతో కలిసిపోయి వాటి శోషణను అడ్డుకుంటాయి.

3. అరటిపండు + గుడ్డు — ప్రమాదకర కాంబో

కొంతమంది ఆరోగ్యానికి మంచిదని భావించి అరటిపండు, కోడి గుడ్డు కలిపి తింటారు. కానీ ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అరటిలో ఉండే కార్బోహైడ్రేట్స్, గుడ్డులోని ప్రోటీన్ కలయిక వల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

4. స్వీట్స్‌తో గుడ్డు తినకూడదు

స్వీట్స్ తింటూ గుడ్డు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. గుడ్డులోని ప్రోటీన్, చక్కెరలోని అమైనో ఆమ్లాలు కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.

సురక్షితంగా గుడ్డు తినాలంటే…

ఉడికించిన గుడ్డు తినడం ఉత్తమం.

గుడ్డు తిన్న వెంటనే టీ, పాలు, స్వీట్స్, చేపలు వంటి ఆహారాలను తినకూడదు.

గుడ్డు తిన్న తర్వాత కనీసం 30–40 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మంచిది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp