Home » Health » Ginger Side Effects In Telugu
Health

Ginger : అల్లం అధికంగా వాడుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు…!

Authored By
aruna
The Telugu News | Published on: February 21, 2024, 11:00 am
Advertisement

Ginger L అల్లం అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిని వంటకాలలో టీ ,కాఫీ లలో వాడుతూ ఉంటారు. అయితే అల్లం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సంగతి అందరికీ తెలిసిందే… అయితే ఈ ఆల్లాన్ని అధికంగా వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ అల్లం అధిక అధికంగా వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం… అల్లం అధికంగా వాడటం వల్ల అజీర్ణం విరోచనాలు, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి.ప్రతిరోజు అల్లం రసం తాగడం వలన బరువు తగ్గుతారని అనుకుంటారు.

Advertisement

అయితే ఇలా నిత్యం అల్లం రసం తీసుకోవడం వలన గర్భాశయాన్ని సంకోషించేలా చేస్తుంది. కావున గర్భిణీ స్త్రీలు అల్లానికి కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ఈ అల్లం రక్తపోటుని తగ్గిస్తుంది. అల్లం అధికంగా తినడం వలన శరీరంలో ఆసిడ్ రిప్లెక్స్ సమస్య వస్తుంది. కావున గర్భిణీ స్త్రీలు అల్లం తినకుండా ఉండడమే మంచిది. అల్లం అధికంగా తినడం వలన పుట్ట బోయే బిడ్డపై ఆ ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. సుదీర్ఘకాలంలో డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కూడా అల్లం ఎక్కువగా వాడకూడదని చెప్తున్నారు.ప్రతిరోజు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

అల్లం అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వాంతులు సమస్య ఏర్పడుతుంది. అలాగే షుగర్ కి మందులు వాడేవారు ఈ అల్లం అధికంగా తీసుకుంటే అకస్మాత్తుగా రక్తపోటు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అల్లం వాడడం వల్ల జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఈ అల్లంని అధికంగా వాడటం వల్ల శరీరంలో వేడి తత్వం పెరుగుతుంది. ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కావున అల్లాన్ని అధికంగా తీసుకోవద్దు.. మూలిక పదార్థాలు అందరి శరీరంలో ఒకేలాగా పనిచేయవు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకోవడం మంచిది..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి