Green Beans : బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Beans : బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…??

 Authored By ramu | The Telugu News | Updated on :30 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Green Beans : బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...??

Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన పోషకాలు దాగి ఉంటాయి. అయితే ఈ కూరగాయలలో ఒకటి బీన్స్. ఈ బీన్స్ తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ బీన్స్ లో ఉండే మెగ్నీషియం అనేది గుండె సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను కూడా ఇస్తుంది. అంతేకాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్దిష్టంగా ఉంచుతుంది. అలాగే మలబద్ధక సమస్య నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్స్,కాపర్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్ లాంటి మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇది మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలను ఇస్తుంది. అలాగే బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు. ఇది చాలా తక్కువ కొవ్వూను కలిగి ఉంటుంది…

ఈ బీన్స్ లో ఎక్కువ ఫైబర్ ఉండడం వలన జీర్ణక్రియ వ్యవస్థలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మలబద్ధక సమస్యను కూడా నియంత్రిస్తుంది. అయితే ఈ బీన్స్ అనేవి నెమ్మదిగా జీర్ణం అయ్యే ప్రోటీన్స్ మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ బీన్స్ లో ఎక్కువ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ బీన్స్ లో ప్రతినిత్యం తీసుకోవడం వలన అధిక బరువును నియంత్రించవచ్చు. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన ఘట్ బ్యాక్టీరియా ను పెంచుతుంది…

Green Beans బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Green Beans : బీన్స్ ను ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…??

ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి శరీర పెరుగుదలకు మరియు ఆరోగ్యంగా ఉండడానికి, శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఈ బీన్స్ అనేవి ప్రోటీన్స్ కు మూలాధారం కావడం వలన శాకాహారులకు మంచి ఆహారం అని చెప్పొచ్చు. కావున వీటిని నిత్యం కచ్చితంగా తీసుకోవడం వలన మనం ఎంతో ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది