Green Tomatoes : పచ్చి టమాటాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Tomatoes : పచ్చి టమాటాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు…!

 Authored By ramu | The Telugu News | Updated on :17 June 2024,7:00 am

Green Tomatoes : టమాట ప్రతి ఒక్కరి వంటింట్లోను అతి ముఖ్యమైనటువంటి కూరగాయ ఇది. టమాటాలు లేకుండా ఏ కూర కూడా పూర్తి కానే కాదు. టమాటో ఆరోగ్యానికి మాత్రమే కాక అందానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా ఎర్రటి టమాటాలు సాంబారు, పులుసు,చెట్నీలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే పచ్చి టమాటాలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా. లేదు కదా. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి టమాటాలో క్యాల్షియం,పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి టమాటాలో విటమిన్లు A, C, ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి..

– గ్రీన్ టమాటాలో విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ అనేవి ఎక్కువ మోతాదులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన ఎముకలు అనేవి దృఢంగా తయారు అవుతాయి. ఈ పచ్చి టమటాలను చిన్న పిల్లలకు ప్రతి రోజు ఇచ్చినట్లయితే వారు స్ట్రాంగ్ గా కూడా ఎదుగుతారు.

– పచ్చి టమాటాలో బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కళ్ళను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఆధారంగా ఐ ఫోకస్ ను ఎంతో మెరుగు పరుస్తుంది. అలాగే వీటిలో విటమిన్ A అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా ఎంతో పోషణను ఇస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది.

– ఈ పచ్చి టమాటాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి ఉండటం వలన క్యాన్సర్ కూడా రాకుండా నియంత్రిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ఈ పచ్చి టమాటాలను తీసుకున్నట్లయితే మెరుగైన రిలీఫ్ అనేది పొందుతారు. అలాగే వీటిని తింటే రోగనిరోధక శక్తి అనేది కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇది సీజనల్ వ్యాధులను కూడా వెంటనే నియంత్రిస్తుంది.

Green Tomatoes పచ్చి టమాటాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

Green Tomatoes : పచ్చి టమాటాలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు…!

– పచ్చి టమాటాలు తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్ బాధితులు మంచి ఫలితాలను కూడా పొందవచ్చు అని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపీట్, ఫైబర్ లాంటి పోషకాలు ఆక్సికరణ ఒత్తిడిని నియంత్రించడంలో మరియు కణజాల నష్టాన్ని నియంత్రించడంలో, మంటను నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి.

-పచ్చి టమాటాలు అనేవి పుల్ల పుల్లగా బాగుంటాయి. కావున వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకుని సలాడ్ లాంటి వాటిలలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. కూరల్లో,స్మూతీస్,సూప్ లాంటి వాటిలో కూడా వీటిని యాడ్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. లేకుంటే నేరుగా కాస్త ఉప్పు, కారం చల్లుకొని కూడా తీసుకోవచ్చు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది