అతికిరాతకంగా టమాట రైతు హత్య… నోట్లో గుడ్డలు..!!

Advertisement

దేశవ్యాప్తంగా టమాట ధర ఆకాశాన్ని అంటిన్న సంగతి తెలిసిందే. దాదాపు కేజీ 150 రూపాయలు పలుకుతూ ఉండటంతో.. ప్రజలు టమాటో కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా టమాట ధరలు పెరగటంతో మధ్యతరగతి మరియు పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా టమాట డిమాండ్ పెరగడంతో కొన్నిచోట్ల అక్రమ రవాణా జరుగుతూ ఉంది. టమాటా వ్యానులను కూడా మాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుపతిలో ఏకంగా టమాట రైతుని నోట్లో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా చంపడం జరిగింది.

Advertisement

అది కూడా తన పంటను అమ్మిన కొద్ది గంటల్లోనే ఆ టమాటా రైతు హత్య చేయబడటం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లాకి నార్రేం రాజశేఖర్ రెడ్డి టమాట వ్యాపారం చేస్తూ ఉంటాడు. కాగా మంగళవారం పంట చేతికి రావటంతో పెద్ద ఎత్తున ఆ పంటను మదనపల్లి మార్కెట్ లో విక్రయించడం జరిగింది. టమాటా కి డిమాండ్ బాగా ఉండటంతో రేటు బాగా పలకడంతో డబ్బులు కూడా బాగా వచ్చాయి. దీంతో ఆ డబ్బులు తీసుకుని నార్రేం రాజశేఖర్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది.

Advertisement
tomato farmers murder in tirupati district
tomato farmers murder in tirupati district

ఆ తర్వాత బుధవారం రాజశేఖర్ రెడ్డి చెట్ల మధ్య శవమై కనిపించాడు. ఎవరో అతన్ని చాలా దారుణంగా అతికరాతకంగా హత్య చేశారు. అయితే ఈ హత్య రైతు దగ్గర డబ్బులు దోచుకునేందుకే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజశేఖర్ మెడకు టవల్ తో బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement