Hair care tips
Hair care tips ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలిపోవడం, తెల్ల వెంట్రుకలు రావడం, చుండ్రు రావడం ఇలా ఎన్నో సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ వాటి వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. చాలామంది మన ఇంటి చుట్టుపక్కల ఉండే గుంటగలగర ఆకు మొక్కను చూసే ఉంటారు.
చాలామంది దీనిని పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు గురించి పల్లెటూర్లలో ఉండే వారికి బాగా తెలుస్తుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు వాడే బదులు ప్రకృతిలో దొరికే ఈ ఆకుతో నూనె తయారు చేసుకుని జుట్టుకు రాసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ గుంటగలగర ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ ఆకు రసం ఒక కప్పు తీసుకుంటే మరొక కప్పు కొబ్బరి నూనె తీసుకొని రెండింటిని కలిపి ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి రసం అంత విరిగిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి.
Hair care tips
ఇలా మరిగిన నూనెను వడకట్టి సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. అలాగే జుట్టు పెరిగి బలంగా తయారవుతుంది. గుంటగలగర ఆకు దొరకని వారు మార్కెట్లో దీని పొడి దొరుకుతుంది. ఆ పొడితో నూనెను తయారు చేసుకోవచ్చు. ఈ ఆకును ఒకసారి తయారు చేసుకుంటే నెలరోజుల వరకు వాడవచ్చు. ఈ నూనె వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అన్ని వయసులో వారు ప్రయత్నించవచ్చు. ఈ నూనె రాసిన తర్వాత నెల రోజులకి రిజల్ట్ తెలుస్తుంది. ఈ నూనె రాసుకోవడం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
Jagadish Reddy : Telangana CM తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy పై బీఆర్ఎస్ సీనియర్ నేత,…
Bala Ramayanam : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాకముందే, బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన సంగతి…
Katari Eswar : గుడివాడలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్న తరుణంలో, మాజీ మంత్రులు కొడాలి నాని మరియు కటారి ఈశ్వర్…
ATM Cash : డెబిట్ కార్డు లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు ఆర్బీఐ కల్పిస్తోంది. నగదు…
engue Vaccine : వర్షాకాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువే.…
Razakar Villain : రజాకార్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన…
500 Note Ban : దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక సందేశం ప్రజల్లో తీవ్ర కలవరం…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత…
This website uses cookies.