Hair Tips : 20 ఏళ్లకే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా… దానికి కారణాలు ఇవే…!!
Hair Tips : చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ తెల్ల జుట్టుకి ఎన్నో రకాల ఆయిల్స్ ఎన్నో కెమికల్స్ ఉన్న షాంపూసు ను వాడుతూ ఉంటారు. అందంగా ఉండాలంటే జుట్టు నలుపు కలర్లో ఉంటేనే చాలా బాగుంటుంది. ఒక తెల్ల వెంట్రుక వచ్చిన జుట్టు అందాన్ని కోల్పోతూ ఉంటుంది. చాలామంది తెల్ల జుట్టు వస్తే ముసలి వాళ్లు అయిపోయామని బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ఇబ్బంది ఇప్పుడు చిన్న వయసులోనే యువతలో ఎక్కువగా వస్తుంది. 20 ఏళ్లు నిండకముందే ఈ తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకి ఎన్నో కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చాలామందికి జన్యు సంబంధమైన కారణాలవల్ల జుట్టు తెల్లగా మారుతూ ఉంటుంది.
అలాగే హార్మోన్లలో అసమతుల్యత, పోషకాలు కారణంగా ఈ సమస్య వస్తుంటుంది. జుట్టుకు కెమికల్స్ వాడడం, పొల్యూషన్ వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోవడం ఇలా తెల్లజుట్టు వస్తూ ఉంటుంది. అలాగే స్మోకింగ్ చేసేవారిలో కూడా ఈ తెల్ల జుట్టు సమస్య వస్తూ ఉంటుంది అని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోయినా జుట్టు ఆరోగ్యానికి నష్టం కలిగిస్తూ ఉంటుంది. పోషకాల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసం లాంటి ప్రధానమైన ఆహారాలను తీసుకుంటూ ఉండాలి.
ఒత్తిడి, నిద్రలేమి ,ఆందోళన ఆకలి మందగించడం లాంటి సమస్యలు కారణంగా కూడా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. అలాగే జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది.
పొగ తాగే వారిలో జుట్టు, చర్మం ఆరోగ్యానికి ప్రమాదకరం. సిగరెట్లలో ఉండే ట్యాక్సీన్ వెంట్రుకల కుదురులను చిట్లిపోయేలా చేస్తాయి. దీంతో తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను వాడడం వలన కూడా జుట్టు తెల్లబడే సమస్య అధికమవుతూ ఉంటుంది. హెయిర్ ప్రోడక్ట్ లో ఉండే సెల్ఫట్ కొన్ని ఉపయోగాలు చేకూర్చినప్పటికీ వీటివలన జుట్టు తెల్లబారిపోతుంది. హెయిర్ స్టైల్ వలన వెంట్రుకలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్లు తరచుగా చేసుకోవడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటి వాటికి దూరంగా ఉండి అని నాచురల్ కొంకుడుకాయలు, షికాయా ఉసిరి పొడితో జుట్టు కు అప్లై చేసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు..