Hair Tips : జుట్టు ఆరోగ్యం కోసం ఈ ఒక్కటి చేయండి చాలు.. సూపర్ రిజల్ట్స్ వస్తాయి..
Hair Tips : శరీరంలో రక్తం తక్కువగా ఉంటే అది అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చర్మం కాంతిని కోల్పోతుంది. ముఖం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాగే.. జుట్టు రాలిపోవడానికి శరీరంలో రక్తం లేకపోవడం ప్రధాన కారణం అవుతుంది. అలాంటప్పుడు మనం తీసుకునే ఆహారంలో రక్తాన్ని పెంచే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను భాగం చేసుకోవాలి. అలాంటి ఒక ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం శాతం పెరగడానికి జుట్టు రాలిపోవడం అరికట్టడానికి ఒక లడ్డూని తయారు చేసుకుందాం.దాని కోసం మనం హలీం విత్తనాలు అనే పోషకాల యొక్క చిన్న నిధిలాంటి ఈ చిన్న విత్తనాలను తీసుకోవాలి.
ఈ విత్తనాలు బరువు తగ్గడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అవి చూడడానికి నువ్వుల్లా ఉంటాయి. కానీ నీటిలో నానబెడితే సబ్జా గింజల్లా ఉబ్బుతాయి. వీటిని 100 గ్రాములు తీసుకొని అవి మునిగేంత వరకు నీటిని పోసి 3 గంటల పాటు బాగా నాన బెట్టాలి. ఈ 3 గంటల్లో ఈ విత్తనాలు నీటిని పీల్చుకుని పెద్దగా ఉబ్బుతాయి. తర్వాత స్టౌ పై 200 గ్రాముల బెల్లంతో పాకం చేసుకోవాలి.బెల్లం బాగా కరిగి బుడగలు వస్తున్నప్పుడు నాన బెట్టుకున్న హలీం విత్తనాలను ఇందులో వేసుకోవాలి. వీటిని మాడి పోకుండా చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి.
ఈ మిశ్రమం బాగా దగ్గరయి గిన్నె నుండి విడిగా అవుతున్నప్పుడు ఒక ప్లేట్కు నెయ్యి రాసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. తర్వాత వీటిని రోజూ ఒకటి తీసుకోవడం వలన శరీరంలో రక్తం పెరగడం, ముఖం కాంతివంతంగా తయారుకావడం, జుట్టు సమస్యలు తగ్గడం వంటివి మీరు గమనిస్తారు. ఈ విత్తనాలకు రక్తహీనతను తగ్గించడంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.హలీమ్ విత్తనాలతో చేసిన ఈ మిశ్రమాన్ని తింటే బాలింతలలో పాలు పెరుగుతాయి. అవి రుతుస్రావాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. హలీమ్ విత్తనాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరియు హలీమ్ విత్తనాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి.