Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??
ప్రధానాంశాలు:
Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి...??
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ ఉంటాయి. అలాగే దుమ్ము మరియు కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు మరియు హెయిర్ స్టైలింగ్ పరికరాల నుండి వెలువడే వేడి, రసాయన ఉత్పత్తుల వాడకం లాంటి వాటి వలన జుట్టు రాలిపోవడం మరియు జుట్టు చివర్లు చిట్లిపోవడం లాంటి సమస్యలు వచ్చి పడతాయి. ఇలా పాడైన జుట్టుకు వెంటనే చికిత్స చేయాలి. లేకుంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నది. అయితే కొబ్బరినూనె చిట్లిన జుట్టును త్వరగా నయం చేస్తుంది. ఈ కొబ్బరి నూనెను జుట్టుకి అప్లై చేసుకోవడం వలన జుట్టు రిపేర్ అవుతుంది. అలాగే ఎంతో దృఢంగా కూడా ఉంటుంది. అయితే ఈ కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాలు పాటు మసాజ్ చేయాలి. రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి.
చిట్లిన జుట్టు చివర్లను వదిలించుకోవాలి అంటే, ప్రతి మూడు నెలల నుండి నాలుగు నెలలకు ఒకసారి జుట్టును కత్తిరించాలి. ఈ చిట్లిన జుట్టు చివర్లను కత్తిరించడం వలన జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే చిట్లిన జుట్టుకు చికిత్స చేయడానికి అరటిపండు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ అరటి పండుతో చేసిన హెయిర్ మాస్క్ వలన ఈ సమస్య అనేది తొందరగా నయం అవుతుంది.
దీనికోసం పండిన అరటిపండును తీసుకొని దానిని మెత్తగా చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం మరియు పెరుగు, రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. దీనిని ఒక గంట ఆరనిచ్చి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చాలు. అలాగే బొప్పాయి కూడా జుట్టుకు ఎంతో పోషణను ఇస్తుంది. ఈ బొప్పాయి కోల్పోయిన జుట్టు యొక్క మెరుపును తిరిగి తీసుకు వస్తుంది. దీనికోసం బొప్పాయిని మెత్తగా చేసి దానిలో పెరుగు వేసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించి ఒక 30 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే చాలు .