Hair Tips : రెండుసార్లు ఈ టాప్ సీక్రెట్ వాడితే చాలు… జుట్టు వేగంగా పెరుగుతుంది…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: November 18, 2022, 11:42 am

Hair Tips : మనం చాలామందిలో జుట్టు రాలే సమస్య నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమస్యలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. తప్ప తక్కువ అవడం లేదు.. ఈ సమస్య కొన్ని ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితులు వలన ఈ సమస్య ఎక్కువ అవుతుంది. వయసు తరహా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్య కనబడుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం హెయిర్ ఆయిల్ ను వాడుతున్నారు. అయితే వాటిలో ఉండే కొన్ని కెమికల్స్ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ని వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే నాచురల్ గా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగే చిట్కాను ఇప్పుడు చూద్దాం.. దానికోసం ముందుగా మనం మునగాకుల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి.

మునగాకులు జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక తర్వాతది దీనిలో అర గ్లాసు మజ్జిగ లేదా పెరుగు వేసి బాగా పేస్ట్ ల పట్టుకోవాలి. తర్వాత దీనిని వడకట్టుకుని జ్యూస్ మాత్రమే తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ని కూడా వాడుకోవచ్చు. అయితే తలస్నానం చేసిన తర్వాత ఈ పిప్పి జుట్టులో అట్లనే అతికిపోయి ఉంటుంది. కావున ఇప్పుడు మన జ్యూస్ ని తీసుకొని వాడుకోబోతున్నాం. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని బృంగ్ రాజు పౌడర్ ను మూడు స్పూన్లు దాన్లో వేసుకోవాలి. ఈ పౌడర్ ని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవాలి. తదుపరి దాంట్లో ఒక ఎగ్ వైట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత 45 నిమిషాల పాటు దానిని ఎండనివ్వాలి. తర్వాత ఏదైనా గాడత తక్కువ గల షాంపుతో తలస్నానం చేయాలి.

Hair Tips on Long hair for Munaga Paste

Hair Tips on Long hair for Munaga Paste

ఈ విధంగా చేయడం వలన జుట్టు రాలడం ఆగి జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ ని వినియోగించడం వలన తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారుతాయి. పెరుగు వాడడం వలన జుట్టు మెరిసిపోతూ ఉంటుంది. అలాగే మునగాకులో ఉండే విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడతాయి. తర్వాత ఇన్ఫెక్షన్స్ దురద, చుండ్రు సోరియాసిస్ లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఎగ్ వైట్ జుట్టుకి కావలసిన ప్రోటీన్ అందించడంలో ఉపయోగపడుతుంది. దీనిని రెండుసార్లు వాడినట్లయితే మీ జుట్టు రాలడం ఆగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. బృంగరాజ్ ఇది జుట్టు కుదుల నుండి చివరి వరకు బలంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బృంగ్రాజ్ పొడి జుట్టు నల్లగా మారడానికి కూడా ఉపయోగపడుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp