Hair Tips : జుట్టు బాగా ఊడుతుందా… అయితే ఇలా ట్రై చేయండి…!
ప్రధానాంశాలు:
Hair Tips : జుట్టు బాగా ఊడుతుందా... అయితే ఇలా ట్రై చేయండి...!
Hair Tips : ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ఫలితం ఉండదు ఎక్కువమంది జుట్టు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఎంత జాగ్రత్త తీసుకున్న కొంతమంది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు తక్కువ ఖర్చుతో సహజమైన మాస్కులను ఉపయోగించి జుట్టును కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం అలాగే జుట్టు వేగంగా పెరగడం కోసం కచ్చితంగా హెయిర్ మాస్కులను ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు.
ఎక్కువ ఖర్చు పెట్టి జుట్టును వివిధ రకాల కెమికల్స్ తో ప్యాక్ వేసుకునే బదులు ఇంట్లో దొరికే వస్తువులతో మంచి ప్యాక్ వేసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు. అవకాడో, అరటి పండ్లు రెండింటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు పెరిగేలా చేస్తాయి. ఈ పండ్లు అరటిపండుతో సగం అవకాడోను మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల నుంచి కుదర్ల దాకా అప్లై చేసుకొని 15 నిమిషాలు ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జుట్టు వేగంగా పొడవుగా మందంగా పెరగటానికి సహాయపడుతుంది.
కొన్ని పువ్వులుల ఆకులను తీసుకొని నీటిలో ఉడకబెట్టాలి. రసాన్ని తీసి జుట్టుకు రాసుకొని కనీసం 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. జుట్టు పెరుగుదలకు ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆముదం నూనెలో ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇందులో యాంటీ మైక్రో బయల్ లక్షణాల వలన జుట్టు పొడిబారటం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే తేనె కూడా జుట్టుకు మంచి తేమనిస్తుంది. రెండు చెంచాల ఆముదం నూనెలో ఒక స్పూన్ తేనె వేసి వేడి చేసి దీన్ని తలకు రాసుకొని చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల వరకు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.