
Hair Tips Use This To Grow Your Hair Thick
Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీని వలన జుట్టు పలుచగా అయిపోతుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం, వాతావరణంలో కలిగి మార్పుల వలన ,పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు పలచగా అయిపోవడం వలన కొందరు మానసికంగా కూడా కృంగిపోతారు అంతేకాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ట్రై చేశారంటే ఆశ్చర్యపోతారు. దీనిలో ఉపయోగించే పదార్థాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయని సైంటిఫిక్ గా నిరూపించబడినది. మెంతులు ఇవి జుట్టు కుదుర్లకు రక్తప్రసరణ బాగా పెంచుతాయి. అంతేకాకుండా మంచి హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తాయి.
రెండవది పెరుగు. పెరుగు వలన జుట్టు స్మూత్ గా, సిల్కీగా ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మూడవది అలోవెరా. ఇది కూడా జుట్టు ఒత్తుగా పెరగటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును స్మూత్ గా ఉంచుతుంది. నాలుగవది ఉసిరి పొడి. ఇది జుట్టులో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి, జుట్టు నల్లగా చేయడానికి సహాయపడుతుంది. ఐదవది బీట్రూట్ జ్యూస్. దీని వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇందులో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి వాడుకోవచ్చు. మెంతులను పొడి చేసుకొని పెరుగులో కలుపుకొని వాడుకోవచ్చు.
Hair Tips Use This To Grow Your Hair Thick
ఇప్పుడు ఈ ఐదింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తలకుదురు నుంచి చివర్లు దాకా మందంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో వేసిన అన్నింటిలోనూ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదురులను హైడ్రేట్ చేస్తూ జుట్టు హార్డ్ గా అవ్వకుండా చేసేసాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ జుట్టుకు రక్తప్రసరణ బాగా వచ్చేటట్టు చేయటానికి సహాయపడతాయి. ఈ హెయిర్ ప్యాక్ వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక అన్ని వయసులవారు వాడవచ్చు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.