Hair Tips : ఇది రాశారంటే… ఎంత పల్చటి జుట్టు అయినా ఒత్తుగా పెరుగుతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఇది రాశారంటే… ఎంత పల్చటి జుట్టు అయినా ఒత్తుగా పెరుగుతుంది…

Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీని వలన జుట్టు పలుచగా అయిపోతుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం, వాతావరణంలో కలిగి మార్పుల వలన ,పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు పలచగా అయిపోవడం వలన కొందరు మానసికంగా కూడా కృంగిపోతారు అంతేకాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాంటివారు […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,3:00 pm

Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీని వలన జుట్టు పలుచగా అయిపోతుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం, వాతావరణంలో కలిగి మార్పుల వలన ,పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య ఎక్కువైపోతుంది. జుట్టు పలచగా అయిపోవడం వలన కొందరు మానసికంగా కూడా కృంగిపోతారు అంతేకాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ట్రై చేశారంటే ఆశ్చర్యపోతారు. దీనిలో ఉపయోగించే పదార్థాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయని సైంటిఫిక్ గా నిరూపించబడినది. మెంతులు ఇవి జుట్టు కుదుర్లకు రక్తప్రసరణ బాగా పెంచుతాయి. అంతేకాకుండా మంచి హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తాయి.

రెండవది పెరుగు. పెరుగు వలన జుట్టు స్మూత్ గా, సిల్కీగా ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మూడవది అలోవెరా. ఇది కూడా జుట్టు ఒత్తుగా పెరగటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును స్మూత్ గా ఉంచుతుంది. నాలుగవది ఉసిరి పొడి. ఇది జుట్టులో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి, జుట్టు నల్లగా చేయడానికి సహాయపడుతుంది. ఐదవది బీట్రూట్ జ్యూస్. దీని వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇందులో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి వాడుకోవచ్చు. మెంతులను పొడి చేసుకొని పెరుగులో కలుపుకొని వాడుకోవచ్చు.

Hair Tips Use This To Grow Your Hair Thick

Hair Tips Use This To Grow Your Hair Thick

ఇప్పుడు ఈ ఐదింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తలకుదురు నుంచి చివర్లు దాకా మందంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు ఉంచి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో వేసిన అన్నింటిలోనూ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదురులను హైడ్రేట్ చేస్తూ జుట్టు హార్డ్ గా అవ్వకుండా చేసేసాయి. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ జుట్టుకు రక్తప్రసరణ బాగా వచ్చేటట్టు చేయటానికి సహాయపడతాయి. ఈ హెయిర్ ప్యాక్ వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక అన్ని వయసులవారు వాడవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది