Health Benefits : డిప్రెషన్ ను దూరం చేసుకోవాలంటే వైద్యులే అసరం లేదు.. ఈ పని చేస్తే చాలు!
Health Benefits : ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కునే సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయినా ప్రేమ విఫలం అయినా అనుకున్నది సాధించలేకపోయినా… డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు నేటి తరం పిల్లలు. అయితే ఈ సమస్య నుంచి దూరం అయ్యేందుకు చాలా మంది కౌన్సిలింగ్ వంటి వాటికి వెళ్తుంటారు. ఇందుకు వేలు, లక్షల్లో డబ్బులు కావాలి. అయితే ఇలా ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి డిప్రెషన్ ను దూరం చేసుకోవచ్చు. అయితే […]
Health Benefits : ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కునే సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయినా ప్రేమ విఫలం అయినా అనుకున్నది సాధించలేకపోయినా… డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు నేటి తరం పిల్లలు. అయితే ఈ సమస్య నుంచి దూరం అయ్యేందుకు చాలా మంది కౌన్సిలింగ్ వంటి వాటికి వెళ్తుంటారు. ఇందుకు వేలు, లక్షల్లో డబ్బులు కావాలి. అయితే ఇలా ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి డిప్రెషన్ ను దూరం చేసుకోవచ్చు. అయితే అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మీరు రోజుంతా ప్రశాంతంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలనుకునే వాళ్లు ప్రతి రోజూ తప్పకుండా స్నానం చేయాలి. అయితే డిప్రెషన్ లో ఉన్న వాళ్లకీ ఏ పనీ చేయాలనిపించదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ మూడీగా ఉంటూ పడుకోవాలని చూస్తుంటారు.
కానీ రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఇది మెదడుని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలాగే మంచి నీళ్లు తాగేటప్పుడు మంచి ఆలోచనలతో తాగండి. ఇది పాజిటివ్ వైబ్స్ అందిస్తుంది. డిప్రెషన్ తో బాధపడేవారు ఆహారంలో సాత్వికమైన ఆరాహం ఉండేలా సచూసుకోండి. అంటే మసాలాలు, జంక్ ఫుడ్, మాంసాహారం వంటివి లేకుండా అన్నమాట. వీటి వల్ల శరీరంలో కోపం, ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయి. అయితే తాజా ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మొక్కలు, మట్టితో బంధాన్ని పెంచుకోవాలి. అంటే తరచుగా మొక్కలు పెంచడం ప్రకృతితో కాసేపు గడపడం వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మెడిటేషన్ కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెదడు మంచి ఆలోచనలు కల్గి ఉంచడంలో సాయపడుతుంది.
యోగా చేయడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంతో పాటు శ్వాస కూడా మెరుగుపడుతుంది. అలాగే మీ మనసుకు నచ్చి మంచి పాటలను వినండి. ఇది కూడా మనసుని హాయిగా ఉండేలా చేస్తుంది. ఇక వీటితో పాటు ప్రతిరోజూ ఉదయాన్నే లేవడం, ఏదైనా గుడికి వెళ్లడం అలవాటుగా చేసుకుంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. కనీం వారంలో ఒఖ రోజు గోరు వెచ్చని నూనెతో బాడీ మసాజ్ చేసుకోండి. ఇది శరీరంలో నొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి తగ్గించి రిలాక్సేషన్ అందిస్తుంది. ప్రతి రోజూ ఒక గంట వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రసాయనాలు విడుదలై సంతోషంగా ఉండటంలో సాయపడుతుంది. కొన్ని సార్లు మన బాధలు చెప్పుకోవడానికి ఎవరూ అందుబాటులో ఉండరు. అప్పుడు అద్దం ముందు నిల్చుని మీ బాధను చెప్పుకొని గట్టిగా ఏడ్చేయండి. ఇలాంటివి ప్రతి రోజూ చేయడం వల్ల డిప్రెషన్ ను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.