Health Benefits : ఈ ఒక్కటి తినడం మానేస్తే చాలు.. బీపీ కంట్రోల్ మీ చేతుల్లోనే..
Health Benefits : ప్రస్తుతం బీపీ వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తోంది. ఆహారపుఅలవాట్లు, మారుతున్న జీవన శైలీ, వ్యాయమం లేకపోవడం వంటి వాటితో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతోంది. అయితే బీపీ కారణంగా గుండె సంబంధిత సమస్యలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. చిన్న వయసు నుండే చాలా మంది షుగర్, బీపీలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ఈరోజుల్లో అందరినీ ఎక్కువగా చుట్టుముడుతున్న సమస్య హై బీపీ. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానియాలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటును కొంత మేర తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అయితే చాలా మంది ఆహార పదర్థాలలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారు. రుచి కోసం చప్పగా తినడానికి ఇష్టపడని వారు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడుతాయి. దీంతో రక్తపోటుకు కారణం అవుతుంది. దీనివల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టకొవాల్సి వస్తుంది. దీంతో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఉప్పు తగ్గించి జీవన శైలీలో మార్పులు చేసుకుంటే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.కాగా నారింజ, నిమ్మకాయ మరియు ద్రాక్షపండ్లు వంటి పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల మీ గుండెకు మేలు జరుగుతుంది. ద్రాక్షపండ్లు తినడం ద్వారా రక్తపోటు ఉన్న పేషెంట్లలో సిస్టోలిక్ రక్తపోటు మరియు డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్షపండులో విటమిన్ సీ, పెక్టిన్ ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. నారింజ రసంతో పోల్చితే, ద్రాక్షపండు రసం ధమనులపై ఒత్తిడి తగ్గిస్తుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు.స్ట్రీట్ ఫుడ్‌కు అలవాటు పడడం కూడా బీపీపై ప్రభావం చూపిస్తుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా బీపీ లో మార్పులు వస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఊరగాయలకు దూరంగా ఉండాలి. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ మానుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. కాగా రెగ్యూలర్ గా వ్యాయామం చేయడం, నడవటం అలవాటు చేసుకోవాలి.