Health Benefits : పొద్దున్నే ఇది త్రాగారంటే.. షుగర్, బీపీ, అధిక బరువు కంట్రోల్ లో ఉంటాయి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : పొద్దున్నే ఇది త్రాగారంటే.. షుగర్, బీపీ, అధిక బరువు కంట్రోల్ లో ఉంటాయి..

Health Benefits : ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ మారిన పడుతున్నారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన, పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి బీపీ వస్తుంది. బీపీ ఉన్నవారికి షుగర్ వస్తుంది. ఈ రెండింటిని జంట రోగాలు అని కూడా అంటారు. అలాగే వీటితోపాటు ఒబేసిటీ కూడా కొందరికి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి బీపీ ఉన్నవారికి ఆహార నియమాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,7:30 am

Health Benefits : ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ మారిన పడుతున్నారు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన, పనిలో ఒత్తిడి ఇలా పలు కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి బీపీ వస్తుంది. బీపీ ఉన్నవారికి షుగర్ వస్తుంది. ఈ రెండింటిని జంట రోగాలు అని కూడా అంటారు. అలాగే వీటితోపాటు ఒబేసిటీ కూడా కొందరికి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి బీపీ ఉన్నవారికి ఆహార నియమాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బీపీ డయాబెటిస్ తో పాటు ఒబిసిటీ కూడా తగ్గించే డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. పొద్దున్నే లేవగానే టీ, కాఫీలు త్రాగకుండా లీటరన్నర మంచినీళ్లను తాగాలి. త్రాగిన కొద్దిసేపటికి మోషన్ అవుతుంది. ఒక గంట విరామం తర్వాత మళ్లీ లీటర్ నర మంచినీళ్లు త్రాగాలి. రెండవసారి మోషన్ అవుతుంది. దీని వలన పొట్ట మరియు ప్రేగులు శుభ్రం అయిపోతాయి. తర్వాత 10 11 గంటల మధ్యలో వెజిటేబుల్ జ్యూస్ తాగాలి.

ముందుగా ఈ జ్యూస్ కోసం ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక క్యారెట్, సొరకాయ, ఒక టొమాటో, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర రెండు మూడు కరివేపాకు రెబ్బలు ,చిన్న బీట్రూట్ ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వడకట్టుకొని త్రాగాలి. రుచి కోసం ఇందులో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకోవాలి. ఈ జ్యూస్ ను చప్పరిస్తూ తాగాలి. ఇలా చప్పరిస్తూ త్రాగడం వలన ఎంజైములు రిలీజ్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. తర్వాత మధ్యాహ్న భోజనంలో బొబ్బర్లు, కొమ్ము శనగలు, రాజ్మా, సోయా గింజలు పచ్చిబఠానీలు 8 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిలో నుండి తీసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వీటిని స్టవ్ పై పెట్టి కొన్ని నీళ్లు పోసుకుని వీటిలో పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర, పాలకూర, కొన్ని పచ్చి వేరుశనగలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీట్రూట్ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, కొన్ని క్యాప్సికం ముక్కలు, కొన్ని ఉల్లికాడ ముక్కలు వేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

Health Benefits for diabetes High blood pressure fat

Health Benefits for diabetes High blood pressure fat

వీటిలో అవిసె గింజల పొడిని వేసుకోవాలి. లేదంటే నంచుకుని తినాలి. రుచిగా కావాలనుకుంటే పైన లైట్ గా ఉప్పు లేదా చాట్ మసాలా వేసుకోవచ్చు. లేదా పెరుగు చట్నీ ని కూడా వేసుకొని తినవచ్చు. సాయంత్రం నాలుగు ఐదు గంటల సమయంలో ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు లేదా బత్తాయి జ్యూస్ తాగాలి. రాత్రి భోజనంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, జామకాయలు వంటివి తీసుకోవాలి. పుచ్చ పప్పు, బాదం, వాల్ నట్స్, పొద్దు తిరుగుడు పప్పు, గుమ్మడి గింజలు, ఖర్జూరాలు వంటివి 12 గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. రాత్రి భోజనాన్ని ఆరున్నర గంటల లోపు తినేయాలి. ఈ డైట్ ని కనుక ఫాలో అవుతే శరీరానికి వ్యాయామం అవసరం లేదు. ఇలా చేస్తే అధిక బరువు, ఒబేసిటీ, బిపి, షుగర్ వంటివి నియంత్రణలోకి వస్తాయి. ఈ డైట్ ను 20 రోజుల నుంచి 30 రోజులు లోపు ఫాలో అవుతే డయాబెటిస్ టాబ్లెట్స్ కూడా తగ్గించుకోవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది