Health Benefits : ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్.. ఆకులో ఎన్నో ఔష‌ద గుణాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్.. ఆకులో ఎన్నో ఔష‌ద గుణాలు

 Authored By mallesh | The Telugu News | Updated on :5 April 2022,2:00 pm

Health Benefits : వాము ప్ర‌తి ఇంట్లోని పోపు డ‌బ్బాల‌లో ఉంటుంది. కానీ వాము ఆకు గురించి చాలామందికి తెలియదు. ప్రతి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో ప్రాబ్ల‌మ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఈ ఆకును వివిధ ప్రదేశాలలో వివిధ రకాల‌ పేర్లతో పిలుస్తారు. రాయలసీమలో కప్పరిల్లాకు అని, ఆంద్రలో కర్పూరం చెట్టు అని, వాము ఆకు చెట్టు అని పిలుస్తారు. ఈ ఆకు వాసన విశిష్టమైంది. వాము మొక్కను మన పెరట్లో సులభంగా పెంచవచ్చు ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క మంచి వాస‌న‌లు వెదజల్లుతుంది.వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఏ, బీ, సీ విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం పుష్క‌లంగా ఉంటాయి.

వాము ఆకుల‌తో బజ్జిలు, పచ్చడి వంటివి తయారుచేస్తారు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు, మలబద్దకం వంటి స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు మంచి ఔష‌దం. వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి చ‌క్క‌టి ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది.చిన్న పిల్లల‌కు దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన గాయాలు, మచ్చలను తగ్గిస్తుంది. చిన్నపిల్లల్లో కడుపునొప్పికి వాము ఆకు మంచి మందు. ప్రతి రోజు భోజనం త‌ర్వాత వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఈ ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

Health Benefits in Ajwain Leaves use our daily life

Health Benefits in Ajwain Leaves use our daily life

Health Benefits : స్ట‌మ‌క్ ప్రాబ్ల‌మ్స్ మాయం..

సోడియం, పొటాషియం, ఐర‌న్, క్యాల్షియం పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల్ల ముత్ర సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. వాము ఆకు టీ తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గి, లంగ్స్ ని కూడా శుభ్ర‌ప‌రుస్తుంది. అలాగే శ‌రీరం డిటాక్సిఫై అవుతుంది. ఈ ఆకుల ర‌సాన్ని తాగితే అల‌స‌ట, బ‌ల‌హీన‌త దుర‌మ‌వుతాయి. ఎముక‌ల వాపు త‌గ్గించ‌డంతో పాటు కీళ్ల‌నొప్పుల‌ను కూడా త‌గ్గిస్తుంది.తలనొప్పి నివారణకు వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది. వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది