Ajwain Leaves : ఈ మొక్కతో కలిగి ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…!
Ajwain Leaves : మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మరియు ఆకులు, పూలు, కాయలు, వేర్లు అనేవి మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి అని అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలలో వాము మొక్క కూడా ఒకటి. అయితే ఈ వాము ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్, ప్రోటీన్స్ లాంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ వాము ఆకు అనేది సీజనల్ గా వచ్చే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను […]
ప్రధానాంశాలు:
Ajwain Leaves : ఈ మొక్కతో కలిగి ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు...!
Ajwain Leaves : మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మరియు ఆకులు, పూలు, కాయలు, వేర్లు అనేవి మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి అని అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలలో వాము మొక్క కూడా ఒకటి. అయితే ఈ వాము ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్, ప్రోటీన్స్ లాంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ వాము ఆకు అనేది సీజనల్ గా వచ్చే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వాము ఆకులు తీసుకుంటే జీవక్రియ సరిగ్గా జరుగుతుంది. అంతేకాక కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వాము ఆకులు తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అంతే కాక అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా వాము ఆకు తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉండడం వలన రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వాడకం ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి మూలకాలు కడుపులో గ్యాస్ట్రిక్ మరియు డైజేస్టివ్ ఎంజైమ్ లను పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కీళ్ళ నొప్పులను మరియు వాపులను కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ ఆకులను నమలి తీసుకోవటం వలన కీళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
అలాగే ఈ వాము ఆకులను రోజుకు రెండు నమలి తీసుకోవడం వలన మన శరీరంలో మేటబాలిజం రేటు అనేది బాగా పెరుగుతుంది. ఇది బరువును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని వాడకం కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అంతే కాక రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు వాము ఆకులను తీసుకుంటూ కొవ్వు ఈజీగా కరుగుతుంది. ఇకపోతే డయాబెటిస్ ఉన్నవారు వాము ఆకుల డికాషన్ తాగితే ఈ సమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే కొన్ని వాము ఆకులను తీసుకొని వాటిని బాగా నలిపి వాసన చూస్తే ముక్కుదిబ్బడ
కూడా సులువుగా తగ్గిపోతుంది. అలాగే ఈ ఆకులతో మరిగించిన నీటిని తీసుకోవడం వలన పట్టి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఈ ఆకులను నమలడం వలన ఇన్సులిన్ స్థాయి ఎంతగానో పెరుగుతుంది. అలాగే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకోవటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే ఈ ఆకులను కొన్నిటిని నీళ్ళ లో వేసి మరిగించి తాగటం వలన గ్యాస్ మరియు అసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాక జీర్ణశక్తిని కూడా బలంగా చేస్తుంది. అంతేకాక శ్వాస కోస సమస్యలు ఉన్నట్లయితే వాము ఆకులతో చూర్ణం చేసుకొని, వాసన చూసిన లేక ఈ ఆకులతో కాచిన నీటిని తాగిన కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది