Health Benefits : మీ హెల్త్ పదిలంగా ఉండాలంటే.. ఈ ఒక్క పండు చాలు వెంటనే కొనేయండి మరి
Health Benefits : పనస పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి. ఎందుకంటే ఈ జాక్ ఫ్రూట్లో పోషకాలు మెండు. ఈ పండ్లు ఏడాదంతా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులూ అవసరం లేకుండా ఇవి పండుతాయి. అందువల్ల ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో విటమిన్ ఏ, సీ, బీ6 మాత్రమే కాక, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.పనసలో పసుపు రంగు నిచ్చే పిగ్మెంట్లు కెరోటినాయిడ్స్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. ఈ కెరోటినాయిడ్లు కణాలు దెబ్బతినకుండా కాపాడి శరీరం సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి. క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు, కంటి శుక్లం, మాక్యులర్ క్షీణత వంటి కంటి సమస్యలను నివారిస్తుంది.
కడుపులో మంట, పుండ్లు ఏర్పడటం వంటివి అల్సర్ సమస్యలో భాగం. పనసలో అల్సర్ తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి. పనసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి, పేగు కదలికలను క్రమం తప్పకుండా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీంతో మలబద్దకానికి మంచి మందులా పనిచేస్తుంది. అలాగే పనసలో ఉండే సహజ రసాయనాలు కడుపులో పుండ్లు రాకుండా చేసి క్యాన్సర్ ని నిరోధిస్తాయి.ఇతర ఆహారాలకంటే పనస పండు స్లోగా జీర్ణం చేసి నెమ్మదిగా గ్రహిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర త్వరగా పెరగదు. డయాబెటీస్ ఉన్నవారికి జాక్ ఫ్రూట్ చక్కటి ఔషదం.
Health Tips : పనసలో సహజ గుణాలు ఎన్నో..
పసనపండ్లతో తయారుచేసే పొడిని వాడితే… డయాబెటిస్ పేషెంట్లకు మేలు జరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల ఇన్సులిన్ తీసుకున్నంత ప్రయోజనం కలుగుతుంది. బీపీని కంట్రోల్ చేయడానికి పనస తొనలు తింటే మంచిది.పనస పండులో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఇది చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. దాంతో చర్మం మెరుస్తుంది. ఇందులో విటమిన్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఎండనుంచి కాపాడుతుంది. ఇందులో చర్మాన్ని కాపాడే ఔషద గుణాలు ఎక్కువ. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పసన తొనలు తినాలి. వీటిలోని పోషకాలు… గుండెకు రకరకాల వ్యాధులు, సమస్యలు రాకుండా ఆపేస్తాయి.