Health Benefits : సమ్మర్ ఫ్రూట్ కర్బుజ వీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.. కాకపోతే ఇవి పాటించండి
Health Benefits : సమ్మర్ లో ఎక్కువగా చెమట రూపంలో వాటర్ బయటకి వెళ్లిపోవడంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంటుంది. అందుకే చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగుతారు. ఫ్పూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. అయితే సమ్మర్ లో ఎక్కువగా లభించే కర్బుజను ఎక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో 95 శాతం నీళ్లు, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటుంది. అంతేకాదు పలు రకాల వ్యాధుల నియంత్రణలో ఖర్బూజ అద్బుతంగా పని చేస్తుంది.
అందుకే నిపుణులు ఈ ఫ్రూట్ ని రెగ్యూలర్ గా తీసుకొమ్మని సూచిస్తున్నారు.ఈ ఫ్రూట్ లో పోటాషియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అన్ని రకాల వయసుల వారు తీసుకోవచ్చు కర్బూజ రెగ్యూలర్ గా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి అధిక బరువు నుంచి కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ, సీ కంటికి అవసరమైన పోషకాల్ని అందించి కంటి సమస్యలను దూరం చేస్తాయి. పొటాషియం కూడా పుష్కలంగా ఉండటం చేత గుండె సంబంధత వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

Health Benefits in Summer Fruit Cucurbita maxima
అంతేకాకుండా మలబద్ధకం సమస్య ఉన్నవారు ఖర్బూజ తీసుకుంటే అద్బుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే నీరు, ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి మోషన్ ఫ్రీగా ఉండేట్లు చేస్తుంది.అలాగే కర్బుజాలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడకుండా మలినాలును బయటకు పంపించి వేస్తాయి. కాగా డయాబెటీస్ రోగులకు కర్బుజా పండు మేలు చేస్తుంది. ఇందులో కేలరీలు షుగర్ లెవల్స్ మోతాదులో ఉండటంతో వీరు రెగ్యూలర్ గా తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ల చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కర్బుజాలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.