Mothers Milk : తల్లి పాలు ఔషధమా… పుట్టిన బిడ్డ ఈ పాలు తాగకపోతే ఏమవుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mothers Milk : తల్లి పాలు ఔషధమా… పుట్టిన బిడ్డ ఈ పాలు తాగకపోతే ఏమవుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 February 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Mothers Milk : తల్లి పాలు ఔషధమా... పుట్టిన బిడ్డ ఈ పాలు తాగకపోతే ఏమవుతుంది...?

Mothers Milk :  ఈరోజుల్లో కొందరు Mother తల్లులు పిల్లలు Chilrans పుట్టగానే చనుపాలు పట్టించడం లేదు. వారి అందం తగ్గిపోతుందని. మరికొందరు జాబ్స్ చేసేవారికి టైం కుదరక ఫొత పాలను పట్టిస్తున్నారు. ఇంకా కొంతమంది తల్లులకు బిడ్డ పుట్టగానే పాలు పడడం లేదు. ఇలా ఎన్నో కారణాల చేత, పుట్టిన వెంటనే పిల్లలకు పాలు అందించడం లేదు. కానీ నిజానికి తల్లిపాలు పుట్టిన బిడ్డకు అమృతంతో సమానం. ఆ తల్లి ప్రసవించిన తరువాత వెంటనే బిడ్డకు పాలు పట్టించాలి. తల్లి ప్రసవం అయిన తరువాత మూడు రోజులు వరకు ముర్రుపాలు అందించాలి. ఈ పాలు వలన బిడ్డకు ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. అలాగే, కనీసం రెండు సంవత్సరాల వరకైనా సరే బిడ్డకు తల్లిపాలే శ్రేష్టం. ఎందుకంటే తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పాలను వెలకట్టలేము. ఇది బిడ్డకు బలవర్ధకమైన ఆహారం. ఈ పాలు పట్టించడం వలన బిడ్డకు మెదడు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలకు ఎంతగానో తల్లిపాలు సహకరిస్తుంది. పిల్లలకు తల్లి తొలి పోషణ, రక్షణ ఇచ్చేది తల్లిపాలే. బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లిపాలు ఇవ్వాల్సిందే అని నిపుణులు తెలియజేస్తున్నారు…

Mothers Milk తల్లి పాలు ఔషధమా పుట్టిన బిడ్డ ఈ పాలు తాగకపోతే ఏమవుతుంది

Mothers Milk : తల్లి పాలు ఔషధమా… పుట్టిన బిడ్డ ఈ పాలు తాగకపోతే ఏమవుతుంది…?

పూత పాలు కంటే తల్లిపాల ప్రాధాన్యత తెలిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం కూడా త్లిపాల వారోత్సవాలు జరుగుతుంది. దీనిపై అవగాహనను కల్పించాలని ప్రతి సంవత్సరం కూడా కొత్త నినాదంతో ఈ వారోత్సవాలను జరుపుతూ వస్తుంది. ఈ సంవత్సరం క్లోజింగ్ ది గ్యాప్ బెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ అనే నినాదంతో ముందుకొచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి తల్లి నుంచి వచ్చే పాలనే ముర్రు పాలు అంటారు. పాలు తల్లి బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డ యొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పుట్టిన గంటలోపు శిశువుకు అందే ఈ పాలు జీవితాంతం వారు ఆరోగ్యంగా ఉంచుటకు ఎంతో అవహేలక పాత్రను వహిస్తాయి. పిల్లల్లో యూనిటీని పెంచుతుంది. వ్యాధులన్నీ సమర్థవంతంగా ఎదుర్కొనే యాంటీ బాడీలు, పోషకాలు తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఆరోగ్యం మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.

Mothers Milk సరైన పోషకాహారం

పుట్టిన శిశువుకు తల్లిపాలు ప్రకృతి అందించే పరిపూర్ణ ఆహారం. బిడ్డ ఎదుగుదలకు ఒక దివ్య ఔషధం. దివ్య అమృతం. అయితే అవసరాలకు అనుగుణంగా ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, కనిజాలతో సహా పోషకాల సమతుల్యతను కలిగి ఉంటుంది ఈ తల్లిపాలు. పాలు బిడ్డకు సులభంగా జీర్ణం అవుతుంది. సరైన పెరుగుదల, అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలను కూడా అందిస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థ : తల్లిపాలలో యాంటీ బాడీస్, తెల్ల రక్త కణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తుంది. జీవితంలోని క్లిష్టమైన ప్రారంభ దశలో చెవి ఇన్ఫెక్షన్స్, తామర, అలర్జీలు, అనారోగ్యాలతో సహా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడగలిగి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా : స్థూల కాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటివి కూడా భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనే ప్రమాదాన్ని తల్లిపాలు తగ్గిస్తాయి. ఈ తల్లిపాలలో ఉండే బయో ఆక్టివ్ భాగాలు శిశువు జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థలను ప్రోగ్రామింగ్ చేయటానికి ఎంతో సహాయపడుతుంది.

జీర్ణ ఆరోగ్యం : తల్లిపాలలో ఫ్రీ బయోటిక్స్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శిశువుకు జీర్ణ వ్యవస్థలో ప్రయోజనకరమైన గట్టు బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది శిశువు యొక్క జీర్ణాశయంతర సమస్యలు నివారించడానికి మరియు పోషకాల సోషలను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి ఈ తల్లిపాలు. అందుకే తల్లి పాలు పట్టించడం శిశువుకి ఎంతో ముఖ్యం. తల్లిపాలు ఆరోగ్యకరం.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది