Amla Juice : ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి… కొద్ది రోజుల్లోనే మీలో వచ్చే మార్పులు గమనించండి…
ప్రధానాంశాలు:
Amla Juice : ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి... కొద్ది రోజుల్లోనే మీలో వచ్చే మార్పులు గమనించండి...
Amla Juice : కరోనా మహమ్మారి మానవాళి ఆరోగ్యాన్ని ఎంతగానో దెబ్బతీసింది. అయితే కరోనా తగ్గినప్పటికీ దాని ప్రభావం పోస్ట్ కోవిడ్ రూపంలో ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నది. ఈ కరోనా మహమ్మారి అనేది మనిషిలోని ఇమ్యూనిటీ పై ఎక్కువగా దాడి చేస్తుంది. దీని వలన ప్రజలు తమ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే నిపుణులు పౌష్టికాహారంతో శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగానే పెంచుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దీనికోసం పకృతి నుండి సహజంగా దొరికే పండ్లు మరియు కూరగాయల ద్వారా కూడా పొందవచ్చు అని అంటున్నారు. ఈ తరుణంలో రోజు ఉసిరి జ్యూస్ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది అని అంటున్నారు…
శరీరంలో కొలెస్ట్రాల్ అనేది అధికంగా ఉన్నట్లయితే సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. అందుకే ముందుగా దానిని తగ్గించాలి. అయితే ఈ ఉసిరిని జ్యూస్ లా చేసి తీసుకోవడం వలన కొలేస్ట్రాల్ సమస్య చాలా వరకు తగ్గుతుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే వీటిలో విటమిన్ సి మరియు యాంటీ యాక్సిడెంట్ అధికంగా ఉంటాయి. అలాగే ఈ ఉసిరి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే ఈ ఉసిరిలో ఉన్న యాంటీ ఇన్ప్లమెంటరీ గుణం శరీర వాపులను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక కీళ్ల నొప్పులను కూడా దూరం చేస్తుంది. అలాగే ఇది గ్యాస్ట్రిక్ రసాలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఈ ఉసిరిలో ఉన్న విటమిన్ లు మరియు ఖనిజాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇది బరువు నిర్వహణకు కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయటంలో కూడా చక్కగా పని చేస్తుంది. ఇది మధుమేహ నిర్వహణకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఉసిరి అనేది ఒక నిర్వీషికరణ ఏజెంట్ గా కూడా పని చేస్తుంది. అలాగే ఎంతో మెరుగైన ఆరోగ్యం కోసం టాక్సిన్స్ ను కూడా బయటకు పంపిస్తుంది. అలాగే ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఇది UV నష్టం నుండి కూడా కాపాడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఈ ఉసిరిలో ఉన్న పోషక గుణాలు అనేవి వెంట్రుకల కుదుళ్ళను కూడా బలంగా చేస్తాయి. అంతేకాక జుట్టు రాలటానికి కూడా తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే అధిక రక్తపోటు రాకుండా కూడా అడ్డుకుంటుంది. ఇది రక్త ప్రసరణకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…