Health Benefits : ఉసిరి పొడిని ఈ పద్ధతిలో తీసుకున్నట్లయితే… సింగిల్ షాట్లో మీ పొట్ట క్లీన్…
Health Benefits : చాలామంది కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులతో చాలా మధన పడిపోతూ ఉంటారు. ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు ఈ మలబద్దకానికి. కానీ వాళ్లకు ఎటువంటి ఉపశమనం కలగదు. అలాంటి వారికి ఇప్పుడు ఒక చిట్కాతో ఈ మలబద్దానికి చెక్ పెట్టవచ్చు.. ఉదయాన్నే లేవగానే ఫ్రీమోషన్ అవ్వకపోతే.. ఆరోజు మొత్తం శరీరమంతా బరువుగా, ఆకలి లేకపోవడం కడుపులో నొప్పి రావడం రకరకాలుగా ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూ అయితే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఉదయం లేవగానే మలవిసర్జనకు ఫ్రీగా జరిగితేనే ఆ పొట్ట ఎంతో క్లీన్ గా ఉంటుంది. శరీరం అలకగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రీ మోషన్ అవ్వని వారికి ఒక ఆయుర్వేద చిట్కాల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మలబద్ధకం ఎలా తగ్గించుకోవాలి – రాత్రి పూట పడుకునే ముందు ఒక కప్పు నీటిలో ఒక స్పూను ఉసిరి పొడిని నీటిలో కలిపి ఉంచండి.
మరుసటి రోజు ఈ వాటర్ ని ఒక కాటన్ క్లాత్ తో వడకట్టి తరువాత ఈ నీటిని త్రాగాలి. ఇలా కాటన్ క్లాత్లో వడకట్టడం వల్ల దాని సున్నితమైన ఫైబర్స్ ను కడిగిన పొడి నీటిలో కి రాదు. ప్రారంభంలో ఈ నీటిని తాగుతున్నప్పుడు చేదుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత దాని రుచిని ఇష్టపడడం మొదలు పెడతారు. అలాగే కడుపులో కూడా దాని ప్రయోజనాలు చూడడం మొదలు పెడుతుంది. ఫస్ట్ రోజు ఈ నీటిని తాగిన 60 నిమిషాలు తర్వాత కడుపులో కదలికలు ప్రారంభమవుతాయి. ఈ వాటర్ ని తాగిన గంట తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది. పొట్ట అంతా శుభ్రం అవుతుంది. మీరు ఈ నీటిని త్రాగలేక పోతుంటే.. ఒక స్పూన్ ఉసిరి పొడిని తీసుకుని నీటిని త్రాగాలి.
అదేవిధంగా ఇలా తీసుకునేటప్పుడు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.ఎటువంటి వారు ఈ నీటిని త్రాగవద్దు; ఈ నీటిని తీసుకునే వారికి శ్వాసకోస సంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే… ఈ నీటిని తీసుకోవద్దు.. ఎందుకంటే దగ్గు లేదా ఛాతిలో నొప్పి, ఊపిరితిత్తులో ఎలాంటి సమస్య ఉన్న అది ఈ నీటిని తీసుకోవడం వలన సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.ఇలా ఈ నీటిని తీసుకున్న తదుపరి కొన్ని రోజుల వరకు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకి వెళ్ళవలసి వస్తుంది. ఈ ఇబ్బంది ఏడు నుండి పది రోజులలో తగ్గకపోతే ఈ నీటిని త్రాగేముందు ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ నీటిని తాగిన తదుపరి నీరసం, దగ్గు ఉన్నట్లయితే.. వైద్యనిపుణ్ణి తో మాట్లాడిన తర్వాత ఈ నీటిని త్రాగడం ఆపవలసి ఉంటుంది. ఎందుకనగా ఈ నీరు ఏమాత్రం మీకు హాని చెయ్యదు. అయితే ఒక మనిషి శరీరంలో ఏదైనా ఇతర ఇబ్బందులు ఉన్నట్లయితే అప్పుడు సమస్యగా మారుతుంది.