Apple : నిజంగా ఈ పండు బ్రహ్మస్త్రమే…రోజుకి ఒకటి చాలు… ఈ సమస్యలన్నీ పరార్…!
ప్రధానాంశాలు:
Apple : నిజంగా ఈ పండు బ్రహ్మస్త్రమే...రోజుకి ఒకటి చాలు... ఈ సమస్యలన్నీ పరార్...!
Apple : ప్రస్తుత కాలంలో జీవన శైలి, ఆహారపు అలవాట్ల వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలలో ఒకటి అధిక కొలెస్ట్రాల్. అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె సమస్యలకు ఎంతో ప్రమాదకరం అవుతుంది. దాని వలన ఈ సమస్యతో బాధపడేవారు కచ్చితంగా రోజు మెడిసిన్ తీసుకోవలసి ఉంటుంది. అయితే రోజు వారి ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కొలెస్ట్రాల్ కు రోజు మందులతో పాటుగా ప్రతిరోజు ఒక ఆపిల్ ను తీసుకోవాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆపిల్ కొలెస్ట్రాల్ మధ్య చాలా దగ్గర సంబంధం అనేది ఉంది అని అధ్యయనాలు తెలిపాయి. ఈ పండు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది..
ఆపిల్స్ పెక్టిన్, పాలీ ఫైనాన్స్, ఫైటో స్టెరాల్స్ లాంటి ఇతర సమ్మేళనాలు కూడా దీనిలో ఉన్నాయి. ఆపిల్లో కరిగే ఫైబర్ కూడా అధికంగా ఉన్నది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రతి నిత్యం రెండు మీడియం సైజు యాపిల్స్ తినటం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను 10% వరకు తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను 10% వరకు పెరిగేలా చేస్తుంది. యాపిల్స్ లోని ఫెనాల్స్ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.
ప్రధానంగా యాపిల్ లో ఉన్నటువంటి పాలిఫైనల్స్ చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. యాపిల్స్ ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరచటంలో సహాయం చేస్తుంది. మలబద్ధక ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. యాపిల్స్ లోని పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచగలదు. కావున ప్రతి రోజుకు ఒక యాపిల్ని తీసుకోవటం వల్ల గుండె సమస్యల ప్రమాదాలను కూడా తగ్గించుకోవచ్చు.