Health Benefits : లవంగం తిని వేడి నీళ్లు తాగితే ఆ విషయంలో ఉరకలేస్తారు.. ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది..
Health Benefits : ప్రస్తుతం వైద్య రంగంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆయుర్వేదానికి కొంత ప్రాధాన్యత తగ్గినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యంలోకి వస్తోంది. ఆధునిక వైద్యానికి లొంగని ఎన్నో రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని చెబుతారు.అయితే తెలియకుండానే మనం ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకుంటాం. నిజానికి చూస్తూ మన వంటిల్లే గొప్ప ఆయుర్వేద శాల. మనం వంటల్లో వాడే మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు, జిలకర్ర, ఆవాలు, దనియాలు ఇలా ప్రతి ఒక్కటీ మనకు మేలు చేసేవే.
వీటిని వంటల్లోనే కాదు కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాకుండా టూత్‌పేస్ట్ తయారీలో కూడా లవంగాలను ఉపయోగిస్తారు.ముఖ్యంగా లవంగాలు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. లవంగాలు శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి. కడుపు ఉబ్బరంగా ఉన్నా.. తిన్న ఆహారం జీర్ణం కాకపోయినా.. నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వికారం లాంటివి కూడా దూరమవుతాయి.జలుబు, దగ్గుకు లవంగం మంచి ఔషదంలా పనిచేస్తుంది.
Health Benefits : జీర్ణ సమస్యలు అన్నీ దూరం..
అలాగే లవంగాలను రోజూ తింటే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోతాయి. బీపీని కంట్రోల్ చేయడంతోపాటు.. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. పొట్టలో అల్సర్ సమస్యలకు లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి. లవంగాలను రెగ్యులర్‌గా తింటే కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి, ఇవి బరువు తగ్గడానికి లవంగాలు తోడ్పటునందిస్తాయి.అలాగే లవంగాలను రెగ్యూలర్ గా తీసుకుంటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఎముకలు కూడా గట్టిపడతాయి. మగవారు రోజు రెండు లవంగాలు తిన్నాక వేడి నీరు తాగితే సెక్సువల్ లైఫ్ బాగుంటుంది.