Health Benefits : మొక్కజొన్న పొత్తులు రుచిలోనే కాదు… ఆరోగ్యంలోనూ ఆమోఘమే…
Health Benefits : వర్షాకాలంలో ఒక ప్రక్క వాన పడుతుంటే, మరో ప్రక్క వేడివేడి బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న తింటుంటే ఆ మజానే వేరేలా ఉంటుంది. ఈ కాలంలో మొక్కజొన్న పొత్తులు బాగా దొరుకుతాయి. మొక్కజొన్నను కాల్చుకుని తిన్న ఉడకబెట్టి తిన్న పాప్ కార్న్ లాగా తీసుకున్న వాటి రుచి అమోఘంగా ఉంటుంది. మొక్కజొన్న పొత్తుల వలన ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఈ కాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మొక్కజొన్నలు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ లు వంటి మూలకాలు ఉంటాయి. అందుకనే వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. మొక్కజొన్న లోని పోషకాలు డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కళ్ళకు మేలు చేస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా అవుతాయి. జుట్టుకు మంచి పోషకాలను అందించి జుట్టు బలంగా, దృఢంగా అయ్యేలా చేస్తాయి.
మొక్కజొన్న వలన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ వలన మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మొక్కజొన్నలను ఉడకబెట్టి, కాల్చుకొని, రోటీలు, కేక్ సమోసా, మసాలా ఇలా వివిధ రకాలుగా చేసుకొని తినవచ్చు. ఎలా తిన్న ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.