Health Benefits : రోజుకో గ్లాస్ కీరా జ్యూస్ తాగితే… వచ్చే మార్పులు చూసి మీరే షాక్ అవుతారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : రోజుకో గ్లాస్ కీరా జ్యూస్ తాగితే… వచ్చే మార్పులు చూసి మీరే షాక్ అవుతారు!

Health Benefits : కీరదోస అంటే ఇష్టపడని వాళ్లుండరు. ఎండాకాల వచ్చిందంటే చాలు చాలా మంది కీరదోస, పుచ్చకాయలే తినడం అలవాటుగా చేస్కుంటారు. అంతే కాదు కళ్ల అంద కోసం కీరదోస ముక్కల్ని వాడటం కూడా మనకు తెలిసిందే. అయితే కేవలం అందం కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా కీరను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కీరదోస మూత్ర పిండాలను బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రక్తస్రావం లోపాలను నియంత్రించడం, ఎముక ఖనిజ సాంధ్రత పెంచడ, […]

 Authored By pavan | The Telugu News | Updated on :10 March 2022,7:30 pm

Health Benefits : కీరదోస అంటే ఇష్టపడని వాళ్లుండరు. ఎండాకాల వచ్చిందంటే చాలు చాలా మంది కీరదోస, పుచ్చకాయలే తినడం అలవాటుగా చేస్కుంటారు. అంతే కాదు కళ్ల అంద కోసం కీరదోస ముక్కల్ని వాడటం కూడా మనకు తెలిసిందే. అయితే కేవలం అందం కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా కీరను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కీరదోస మూత్ర పిండాలను బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రక్తస్రావం లోపాలను నియంత్రించడం, ఎముక ఖనిజ సాంధ్రత పెంచడ, యాంటి కాన్ సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరును పెంచడం, హార్మోన్ల ఉత్పత్తిని నిర్వహించడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

దోసకాయ విత్తనాల సారం యొక్క 500 ఎంజీ మోతాజు వయోజన హైపర్లిపడెమిక్ రోగుల్లో సీరం లిపిడ్ ప్రొఫైల్ పై కావాల్సిన ప్రభావాలను కల్గిస్తుంది అందువల్ల దోసకాయ విత్తనాన్ని ఆరోగ్యకరమైన దోసకాయ రసంలో గ్రైండ్ చేసి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా కూడా చేస్తుంది. దోసకాయ రసంలో ఉండే విటామిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగతుంది. తెల్ల రక్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. హానికరమైన రాడికల్స్ ను నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే కాల్షియం స్థాయి హార్మోన్ల సమతుల్యతకు కీరదోస జ్యూస్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. థైరాయిడ్ గ్రంధి లేదా పిట్యూటరీ గ్రంథి పనిచేయకపోవడం ప్రారంభిస్తే…

Health Benefits of cucumber juice

Health Benefits of cucumber juice

ఈ రసం నుంచి అధిక స్థాయిలో కాల్షియం భర్తీ చేసేందుకు సాయపడుతుంది. హార్మోన్ల స్థాయిని సాధారణం చేస్తుంది.అంతే కాకుండా రక్తస్రావ సమస్యలతో బాధపడుతుంటే… ముఖ్యంగా ముక్కులోంచి రక్తం వస్తున్నా, రుతుస్రాం, హేమోరాయిడ్లు, పళ్ల చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా కీరదోస వాటని తగ్గిస్తుంది. విటామిన్ కె లోపం వల్ల వచ్చే ఈ వ్యాధులను కీరదోస అడ్డుకుంటుంది. రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. అలాగే వేడిమితో బాధపడేవారిని హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉండేలా చేసి మృదువుగా తయారు చేస్తుంది. కీరదోసలో ఉండే విటామిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం బాగుపడుతుంది. అంతే కాకుండా దోసకాయలో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్స్, కుకుర్బిటాసిన్స్, యాంటికాన్సర్ సామర్థ్యాన్ని కల్గి ఉంటాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది