Curry Leaves : పరిగడుపున పచ్చి కరివేపాకును తీసుకుంటే ఎన్ని లాభాలో…!!
Curry Leaves : మనం కరివేపాకుని ఎక్కువగా వంటకాలలో వాడుతూ ఉంటాము. కానీ దీనిని తినటానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఈ కరివేపాకును తీసుకోవడం వలన ఆరోగ్యం మరియు అందనికి కలిగే ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఈ కరివేపాకును తీసుకోవటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ అనేది పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. అయితే ఈ కరివేపాకులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో లాభాలు లభిస్తాయి. అలాగే పచ్చి కరివేపాకును తీసుకోవటం వలన కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ కరివేపాకులో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. ఇది దంతాలు మరియు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కరివేపాకు తినడం వలన కీళ్ళ నొప్పులు మరియు షుగర్ పేషెంట్లకు ఎముకల నొప్పి తగ్గించి వాటిని బలంగా చేస్తుంది. ఈ కరివేపాకులో ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటుంది. కావున దీనిని తీసుకోవడం వలన డిటాక్సిఫైయర్ పని చేస్తుంది…
ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఈ కరివేపాకును తీసుకోవటం వలన మూత్రపిండములో పేర్కొన్నటువంటి వ్యర్ధాలు అనేవి బయటకు పోతాయి. దీంతో మూత్రపిండాల పనితీరు ఎంతో మెరుగుపడుతుంది. అయితే మీరు రోజు ఉదయాన్నే పరిగడుపున పచ్చి కరివేపాకులు తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అయితే ఈ కరివేపాకులో ప్రోటీన్స్ మరియు విటమిన్ సి అధికంగా ఉన్నాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎంత బలంగా మారుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ను మన దరి చేరకుండా చూస్తుంది. అయితే ఈ కరివేపాకును గనుక మనం రోజు తీసుకున్నట్లయితే LDL అనే చెడు కొలెస్ట్రాల్ నయమవుతుంది. దీని వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోదు. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గితే బీపీ కూడా అదుపులో ఉంటుంది…
ఈ కరివేపాకును తీసుకోవడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఈ కరివేపాకులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీని వలన మలబద్ధక సమస్య కూడా దూరం అవుతుంది. అయితే జుట్టు రాలడానికి ప్రధాన కారణం కుదుళ్ళు అనేవి ఆరోగ్యంగా లేకపోవడమే. దీనికి ప్రోటీన్ మరియు ఐరన్ లోపమే కారణం. ఈ రెండు లోపాలు ఉండటం వలన జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలనుకుంటే కరివేపాకును కచ్చితంగా తీసుకోవాలి. కరివేపాకులో ఉండే విటమిన్ బి12 మరియు విటమిన్ ఈ అనేవి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి…