Health Benefits : బరువు తగ్గాలనుకుంటున్నారా… గుడ్డు ఈ విధంగా వీటితో కలిపి తీసుకోండి… ఇక అధిక బరువుకు చెక్…
Health Benefits : అధిక బరువుతో ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటిలో విఫలమైపోతున్నారు.. అయితే అలాంటివారు ఇప్పుడు గుడ్డుతో వీటిని కలిపి తీసుకొని చాలా ఈజీగా బరువును తగ్గించుకోండి ఇలా.. ఆరోగ్యంగా ఉండడం కోసం నిత్యము గుడ్డును తీసుకోవడం శ్రేయస్కరం. ఈ గుడ్డు విటమిన్ల లోపాన్ని తగ్గిస్తుంది. గుడ్డు ఫిట్నెస్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే అధిక బరువు తగ్గాలనుకునే వారు గుడ్డుతో ఈ మూడు పదార్థాలను కలిపి తీసుకోండి. అధిక బరువు ఉండడం వలన శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు గుండెపోటు మధుమేహం ఇలాంటివన్నీ అధిక బరువు వల్ల వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే గుడ్డుతో వీటిని కలిపి తీసుకోవడం వలన వేగవంతంగా బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి.
గుడ్డు వలన బరువు బరువు తగ్గడం ఎలా? గుడ్డు లో విటమిన్లు, ఒమేగా3, ప్రోటీన్లు లాంటి మంచి కొలెస్ట్రాల్ కలిగిన ఫుడ్ ఈ గుడ్డు.. అధిక బరువు తగ్గడానికి నిత్యము బ్రేక్ ఫాస్ట్ లో ఈ గుడ్లని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. ఈ గుడ్డుని ఎన్నో రకాలుగా చేసుకొని తినవచ్చు. ఏదోరకంగా గుడ్డు తిన్నట్లయితే చాలా సమయం వరకు ఆకలి లేకుండా ఉంటుంది. త్వరగా అధిక బరువు తగ్గుతారు. అదేవిధంగా ఈ మూడు పదార్థాలతో కలిపి గుడ్డుని తీసుకోండి. క్యాప్సికం : ఈ క్యాప్సికం గుడ్డుతో కలిపి తీసుకోవాలి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి క్యాప్సికమ్ లో గుడ్డును వేసికుని తినాలి. ఈ విధంగా తీసుకోవడం వలన రుచికి రుచి ఉంటుంది. అదేవిధంగా కొవ్వుని కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
నల్ల మిరియాలు : చాలామంది ఆమ్లెట్లులో ఎండుమిరపకాయలన పొడిని కలిపి ఆమ్లెట్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి బదులుగా మిరియాల పొడిని ఉపయోగించాలి. ఈ పొడి వలన రుచి పెరగడమే కాకుండా గుడ్డు ఆరోగ్యంవంతగా ఉండడంతో పాటు బరువు కూడా వేగవంతంగా తగ్గుతారు. ఈ మిరియాల పొడిలో పైపరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. కొబ్బరినూనె : ఇది ఆరోగ్యానికి ఎంత సహాయపడుతుందో అందరికీ తెలుసు. మీరు కూరగాయలు, గుడ్డు లేక ఆమ్లెట్ తీసుకున్నట్లయితే ఇవి చేసేటప్పుడు రోజువారి ఆయిల్ కి బదులుగా కొబ్బరి నూనెను వాడుకోండి. ఈ కొబ్బరినూనెలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అతి తక్కువగా ఉంటుంది. అధిక కొవ్వుని కరిగించుకోవాలి అంటే. కొబ్బరి నూనెతో మాత్రమే గుడ్డుతో చేసే వంటలు చేయాలి.