Karonda Fruit : కరోండ పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా… రోజుకు ఒకటి తింటే చాలు… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!!
ప్రధానాంశాలు:
Karonda Fruit : కరోండ పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా... రోజుకు ఒకటి తింటే చాలు... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!!
Karonda Fruit : కరోండ పండ్లు అనేవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇవి తినడానికి ఘాటుగా మరియు పులుపుగా కూడా ఉంటాయి. వీటిని చూడడానికి చిన్న పరిమాణంలో మాత్రమే ఉంటాయి. కానీ ఈ పండ్ల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఫైరెటిక్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ, కూలింగ్, యాంటీ అల్సర్,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పండ్లతో చాలా మంది ఊరగాయను మరియు మసాలాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ పండును రోజుకు ఒకటి తీసుకున్న కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు అద్దుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…
గుండె ఆరోగ్యం : ఈ పండు ను రోజుకు ఒకటి తిన్న కూడా గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచడమే కాకుండా గుండె ను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ పండు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ పండును తినటం నచ్చకపోతే దీన్ని జ్యూస్ లా చేసుకొని కూడా తాగవచ్చు. దీంతో శరీరంలోని అన్ని భాగాలకు కూడా రక్త ప్రసరణ బాగా అందుతుంది. కావున ఈ పండును రోజు ఏదో విధంగా తింటే మంచిది…
బరువు తగ్గడం : ఈ పండును తీసుకోవడం వలన కడుపు అనేది నిండుగా అనిపిస్తుంది. దీనివలన ఆకలి అనేది వేయదు. దీంతో ఎటువంటి చిరు తిండ్లు తినకుండా ఉంటారు. దీనివల్ల బరువు తొందరగా తగ్గుతారు. ఈ పండు రోజుకు ఒకటి తింటే చాలు ఎలాంటి చిట్కాలు పాటించకుండా బరువు తగ్గవచ్చు…
రక్త హీనత : రక్తహీనత సమస్యలతో బాధపడే వారు కూడా రోజుకు ఈ పండును ఒకటి తింటే చాలు ఎంతో బలంగా ఉంటారు. దీని వలన రక్తహీనత సమస్య తగ్గటంతో పాటుగా రోగనిరోధక శక్తి ఎంతగానో పెరుగుతుంది…
Karonda Fruit చర్మ ఆరోగ్యం
కరోండ లో ఉన్నటువంటి విటమిన్లు మరియు ప్రోటీన్లు,యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో కూడా ఈ పండు ఎంతో హెల్ప్ చేస్తుంది…
మానసిక ఆరోగ్య : కరోండ పండును మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిలో ఉన్నటువంటి విటమిన్లు మరియు ప్రోటీన్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
జ్వరం : వీటిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షించడంతో పాటు ఎక్కువగా వచ్చే జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి. అయితే బాగా పండిన లేక ఎండిన కరోండ తీసుకుంటే అధిక జ్వరం తగ్గుతుంది…
జీర్ణ సమస్యలు : ఈ పండులో పెక్టీన్ అనేది అధికంగా ఉంటుంది. దీనివలన జీర్ణ క్రియ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దీనిలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది…