Health Benefits : ఈ పండ్లు తింటే హ్యూమన్ బాడీ రీ ప్రెష్.. కివీస్ లో పోషకాలు పుష్కలం
Health Benefits : కివీ పండ్లు చిన్న సపోటా ఆకారంలో ఉండి పోషకాలతో నిండినవి. మిగిలిన పళ్లలో లేని ఎన్నో పోషక గుణాలు ఈ కివీ పండులో ఉన్నాయి. కరోనా, డెంగీ ఉగ్రరూపం దాల్చినపుడు రోగులకు కివీ పళ్లు తినిపించమని ఎక్కువ మంది డాక్టర్లు సలహా ఇచ్చారు. కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి.విటమిన్ సీ, పొటాషియం, విటమిన్ కే, పోలెట్, విటమిన్ ఇ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కివీస్ సంవత్సరం పొడవునా దొరుకుతాయి. కాలిఫోర్నియాలో నవంబర్ నుండి మే వరకు, న్యూజిలాండ్ లో జూన్ నుండి అక్టోబర్ వరకు లభిస్తాయి.
అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం.కివీస్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రెగ్యూలర్గా తీసుకుంటే లగ్స్ పనితీరు కూగా బాగుంటుంది. జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాలను దరిచేరనివ్వుదు.నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధం. దీనిలో ఉండే సెరొటోనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
Health Benefits : రోగనిరోధక శక్తి ఎక్కువ..
అలాగే కివీస్లో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అయితే రోజుకు రెండు లేదా మూడు కివీ పండ్లు తింటే కంటి వ్యాధులు దరిచేరవు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి. సాధారణంగా ఆక్సీకరణ ఒత్తిడి వలన హ్యూమన్ బాడీలో డీఎన్ఏ దెబ్బతింటుంది. ఇది ఈనేక జబ్బులకు దారి తీస్తుంది. కివీస్ ని రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.కివీస్ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అలాగే రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీస్ కి ఉంది. ఇది మధుమేహం ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది.