Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు… కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు... కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి...!

Pindi Kura : మన ఆరోగ్యం కోసం తరచుగా ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఆకు కూరలలో ఎక్కువగా ఖనిజ పోషకాలు మరియు ఇనుము దాతువును కలిగి ఉంటాయి. మన శరీరంలో ఐరన్ లోపం ఉండటం వలన అనిమీయాతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ప్రతినిత్యం మీరు తీసుకునే ఆహారంలో ఈ ఆకుకూరలను చేర్చుకోవటం చాలా అవసరం. దీనివలన అనీమియాను తగ్గించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు అని అంటున్నారు నిపునులు. ఈ ఆకుకూరలలో కాల్షియం, బీటా కెరోటిన్, విటమిన్ సి కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఈ ఆకుకూరల వలన వచ్చే కెరోటిన్ అనేది మన శరీరంలో విటమిన్ ఏ గా మారి అందత్వం అనేది రాకుండా చేస్తుంది. దీనిలోని విటమిన్ సి అనేది ఎంతో ఆరోగ్యకరమైన ఎముకలకు మరియు దంతాలకు ఎంతో ముఖ్యమైన పోషకం. ఈ ఆకుకూరలో కొన్ని రకాల విటమిన్లు,బీ కాంప్లెక్స్ ను కూడా కలిగి ఉన్నాయి. పల్లెటూర్లలో ఈ పిండి కూర ఆకులను ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూనే ఉంటాం. ఈ పిండి కూర చెట్టు అనేది మన ఇంటి ముందు లేక మన పెరట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే సంక్రాంతి టైం లో గొబ్బెమ్మలకు రేగి పండ్లు, గరిక, ధాన్యాలతో పాటుగా ఈ పిండి కూర రెక్కలను అలంకరిస్తారు. వీటిని కొండపిండి చెట్టు అని, తెలగపిండి చెట్టు అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ పిండి కూర ఆకులో ఎంతో విశేషమైన గుణం ఉంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఈ పిండి కూర ఆకును పాషానభేది అని కూడా అంటుంటారు. దీని అర్థం రాళ్లను కూడా కరిగించగలదు అని. ఈ పిండి కూర కిడ్నీలోని రాళ్ళను కూడా కరిగించగల గుణం ఉంది అని అంటున్నారు…

ఈ పిండి కూర మొక్కని వేళ్ళతో సహా వాడుతూ ఉంటారు. దీనికోసం కావలసిన మోతాదులో పిండి కూర ఆకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ ఆకులను కట్ చేసుకుని అర లీటర్ వాటర్ లో వేసుకొని మరిగించుకోవాలి. ఈ నీరు అనేది సగానికి మరిగిన తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఈ రసానికి ఒక 30 గ్రాముల పటిక బెల్లాన్ని మరియు రెండు గ్రాముల శిలాజిత్ పొడిని కలుపుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రతి నిత్యం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని నిపుణులు అంటున్నారు. ఇలా గనక మీరు చేసినట్లయితే మూత్రాశయంలో మరియు కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అయితే ఈ పిండి కూర ఆకును వేర్లతో సహా తెచ్చుకొని క్లీన్ చేసుకుని దంచి మెత్తగా చేసుకోవాలి. దీనిని ఒక ముద్ద లాగా చేసుకుని ఒక గుడ్డలో వేసుకొని పిండినట్లయితే దీని నుండి రసం వస్తుంది. ఈ రసానికి సమానంగా పట్టిక బెల్లాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై మరిగించాలి.ఈ మిశ్రమం లేత పాకం వచ్చే వరకు మరిగించాలి. దీని తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని నిలువ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పెద్దవారైతే ఒకటి లేక రెండు చెంచాలు, పిల్లలైతే అర చెంచా ప్రతినిత్యం తీసుకున్నట్లయితే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు... కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి...!

Pindi Kura : ఈ ఆకు కూరను తీసుకుంటే చాలు… కిడ్నీలో రాళ్లు ఇట్టే కరుగుతాయి…!

ఈ పిండి కూర ఆకుని ఎంతోమంది కూరగా కూడా చేసుకుని తిట్టుంటారు. ఉల్లిపాయ లేక పప్పులో వేసుకొని వండుకుంటే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ పిండి కూర ఆకుని కూర చేసుకుని తీసుకోవడం వలన మూత్రపిండంలో ఉన్న వ్యర్ధాలు, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీకు ఈ పిండి కూర అందుబాటులో ఉన్నట్లయితే దానిని వేర్లతో సహా ఇంటికి తీసుకొచ్చుకోండి. దీని వేర్లు, ఆకులు,పూలతో సహా ఎండబెట్టి పొడి చేసుకొని నిల్వ చేయవచ్చు. మీరు ఎప్పుడూ వాడుకునే టీ పొడి కి బదులుగా ఈ పొడిని వేసుకొని టీ లా కూడా తీసుకోవచ్చు. మీరు కొన్ని రోజులపాటు ఇలా చేసినట్లయితే మూత్రశయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి…

Also read

Tags :

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి