Health Benefits : వావ్ ఈ మొక్కతో ఇన్ని ఉపయోగాలా… తెలిస్తే ఇప్పుడే తెచ్చుకుంటారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వావ్ ఈ మొక్కతో ఇన్ని ఉపయోగాలా… తెలిస్తే ఇప్పుడే తెచ్చుకుంటారు…!

Health Benefits : చాలామంది ఇంట్లో అందం కోసం ఎన్నో మొక్కల్ని నాటి పెంచుతూ ఉంటారు. అయితే మనం పెంచే మొక్కలలో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్న కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కే రణపాల మొక్క. ఈ మొక్క శాస్త్రీయ నామం బయోఫిలం ఫినిటం. ఈ మొక్కను ఆయుర్వేద వైద్య విధానంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అది నిజమైనప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం.. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరుబయట […]

 Authored By prabhas | The Telugu News | Updated on :18 December 2022,6:00 am

Health Benefits : చాలామంది ఇంట్లో అందం కోసం ఎన్నో మొక్కల్ని నాటి పెంచుతూ ఉంటారు. అయితే మనం పెంచే మొక్కలలో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్న కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ మొక్కే రణపాల మొక్క. ఈ మొక్క శాస్త్రీయ నామం బయోఫిలం ఫినిటం. ఈ మొక్కను ఆయుర్వేద వైద్య విధానంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అది నిజమైనప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం.. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆరుబయట అందానికి ఎన్నో మొక్కలను పెంచుతూ ఉంటారు. అలా పెంచే మొక్కలలో ఔషధ గుణాలుంటే మీరు విన్నది వాస్తవమే మనం అందం కోసం ఆరు బయట పెంచే మొక్కల్లోనే గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. అదే ఇప్పుడు రణపాల మొక్క ఈ మొక్కను ఎన్నో సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఎన్నో

అనారోగ్య సమస్యలను తగ్గించే గొప్ప ఔషధంగా వాడుతున్నారు. ఈ మొక్కలో ఎన్నో యాంటీబ్యాక్రికల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్టిగా ఉన్నాయి. రణపాల మొక్క వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగాలు : 1) ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాలు కలిపి రోజు 40 ml తీసుకుంటే స్త్రీలు యోని సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. 2) చెవిపోటు సమస్య ఉన్న ఈ ఆకుల రసాన్ని డైరెక్ట్ గా చెవులో వేసుకుంటే నొప్పి వెంటనే తగ్గిపోతుంది.3) శరీరంపై దెబ్బలు, వాపులు ఉన్న ప్రదేశంలో ఈ ఆకుల పేస్టు గుడ్డలో పెట్టి కట్టడం వలన ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 4) ఈ ఆకుల రసాన్ని ఉదయం సాయంత్రం రెండు టీ స్పూన్లు తీసుకోవడం వలన కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది.

Health Benefits of Ranapala plant

Health Benefits of Ranapala plant

5) అలాగే మొలల సమస్య ఉన్నవాళ్లు ఈ మొక్క ఆకుల్ని మిరియాలతో కలిపి తీసుకుంటే గొప్ప ఉపయోగాలు పొందవచ్చు..

6)నడుము నొప్పి తలపోటుతో ఇబ్బంది పడేవారు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకుని లేపనంలా వేసుకుంటే చాలా మేలు చేస్తుంది.

7) రణపాల మొక్కల ఆకులు కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిర్లు, ఉబ్బసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి.

8) రణపాల మొక్కల ఆకుల మందంగా ఉంటాయి. వీటిని తింటే వగరుగా, పులుపుగా ఉంటాయి. వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు ..

9) ఈ ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్లు తీసుకోవడం వల్ల అల్సర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది