Health Benefits : కీవీ పండ్లను ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : కీవీ పండ్లను ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే…

Health Benefits : కీవీ పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లేదా ఆరోగ్యం కోసం కీవీ జ్యూస్ లేదా కీవీ పండు తినాలని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అనేక రకాల వైరల్ ఫీవర్లు, రక్త కణాల సంఖ్య పెంచడానికి కీవీ పండని తినమని చెబుతారు. కీవీలో ఉండే గుణాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 September 2022,6:30 am

Health Benefits : కీవీ పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లేదా ఆరోగ్యం కోసం కీవీ జ్యూస్ లేదా కీవీ పండు తినాలని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అనేక రకాల వైరల్ ఫీవర్లు, రక్త కణాల సంఖ్య పెంచడానికి కీవీ పండని తినమని చెబుతారు. కీవీలో ఉండే గుణాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ B6, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

కీవీలో ఉండే గుణాలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. కానీ ఈ పండును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీంతో అనేక సమస్యలకు దారితీస్తుంది. కీవీని అధిక మోతాదులో తీసుకుంటే ఎలర్జీ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనివల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, నోటి లోపల చికాకు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ రోగులు కివి పండ్లను ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు. కీవీలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది.

Health Benefits of Side effects of kiwi fruits

Health Benefits of  Side effects of kiwi fruits

అందువల్ల కీవీని ఎక్కువగా తీసుకోకూడదు. కీవీ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా పెదవులు, నాలుక వాపు, నోటి లోపల పుండ్లు లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కీవీ పండు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డయోరియా సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కొంతమందికి కడుపునొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే కీవీ పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది