Soybean : సోయాబీన్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే… బోలెడు ప్రయోజనాలు మీ సొంతం…!!
Soybean : సోయా బీన్స్ ను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ కు అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు. ఈ సోయాబీన్స్ లో ఉన్నటువంటి ప్రోటీన్ ను తీసుకోవడం వలన కడుపు ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని ఫలితంగా బరువు ఈజీగా తగ్గుతారు . అలాగే ఈ సోయాబీన్స్ లో సంతృప్త కొవ్వులు చాలా తక్కువ గా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. […]
ప్రధానాంశాలు:
Soybean : సోయాబీన్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే... బోలెడు ప్రయోజనాలు మీ సొంతం...!!
Soybean : సోయా బీన్స్ ను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్ కు అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు. ఈ సోయాబీన్స్ లో ఉన్నటువంటి ప్రోటీన్ ను తీసుకోవడం వలన కడుపు ఎక్కువ సేపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని ఫలితంగా బరువు ఈజీగా తగ్గుతారు . అలాగే ఈ సోయాబీన్స్ లో సంతృప్త కొవ్వులు చాలా తక్కువ గా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ సోయాబీన్స్ లో విటమిన్లు మరియు ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో సహా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సోయాబీన్స్ లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సంపూర్ణతను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే బరువురు నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్న ఫైబర్ అనేది జీర్ణ ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది…
సోయాబీన్స్ ను తీసుకోవడం వలన ఒత్తిడి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ సోయాబీన్స్ ను నిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వలన నిద్ర నాణ్యత ఎంతో మెరుగుపడుతుంది. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. అలాగే సోయాబీన్స్ ఎముకలను బలంగా చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే మహిళల్లో వచ్చే మోనోపాజ్ టైమ్ లో ఎముకలు ఎంతో బలహీనంగా మారతాయి. ఈ టైమ్ లో సోయా ఉత్పత్తులను తీసుకుంటే ఎంతో మంచిది. అలాగే సోయాబీన్స్ లో యాంటీ ఇన్ ఫ్లమేంటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడంతో కొల్లాజెన్ ఉత్పత్తి ఎంతో మెరుగుపడుతుంది. దీని వలన చర్మం ముడతలు కూడా తొందరగా తగ్గిపోతాయి. అలాగే చర్మం తన మెరుపును సంతరించుకుంటుంది…
సోయాబీన్స్ పానీయాలలో ఐసోఫ్లేవోన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్ల ను ఎంతో బలంగా చేస్తాయి. ఈ సోయాబీన్స్ లో విటమిన్ లు మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని నిత్యం కచ్చితంగా తీసుకోవడం వలన పలు రకాల సమస్యలను దరి చేరకుండా చూసుకోవచ్చు. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవటం వలన మహిళలు రోమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే సోయాబీన్స్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్ మాదిరిగా కూడా పనిచేస్తుంది.