Soybean : సోయాబీన్స్ ఆ మజాకా..? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నన్ని చెప్పాలి...? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Soybean : సోయాబీన్స్ ఆ మజాకా..? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నన్ని చెప్పాలి…?

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •   Soybean సోయాబీన్స్ ఆ మజాకా..? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నన్ని చెప్పాలి...?

  •  తరచూ మనం తినే ఆహారంలో సోయాబీన్ ఉండేలా చూసుకుంటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు.

Soybean : సోయాబీన్ లేదా సోయా బిన్ ( గ్లైసిన్ మాక్స్ ) Soybean అనేది తూర్పు ఆసియా కు చెందిన ఒక పప్పు ధాన్యం జాతి. ఈ సోయాబీన్ తినదగిన బీన్ కోసం విస్తృతంగా పెంచుతారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సోయా బీన్స్ లో విటమిన్లు,ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు,సహజ అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుటకు రకరకాల పోషకలను అందిస్తాయి. మీరు ప్రతి రోజు ఆహారంలో సోయాబీన్ ని చేర్చడం ద్వారా, పోషక విలువలు తక్కువగా ఉండి, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని భర్తీ చేయవచ్చు. శరీరంలో క్యాలరీలను తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గవచ్చు.సోయాబీన్స్ యొక్క సాంప్రదాయ పుణ్య పెట్టని ఆహార ఉపయోగాల సోయా పాలు, దీని నుండి టాప్ మరియు టోప్ చర్మాన్ని తయారు చేస్తారు. సోయాబీన్స్ అనేది బటాని కుటుంబానికి చెందినది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . అయితే సోయాబీనుని అధికంగా తినడం వలన వివిధ అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చని శకాహార నిపుణులు తెలియజేయడం జరిగింది. తరచూ మనం తినే ఆహారంలో సోయాబీన్ ఉండేలా చూసుకుంటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Soybean : సోయాబీన్స్ ఆ మజాకా..? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నన్ని చెప్పాలి...?

Soybean : సోయాబీన్స్ ఆ మజాకా..? ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నన్ని చెప్పాలి…?

Soybean చలికాలంలో తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యం

సోయాబీన్స్ ని ఎక్కువగా చలికాలంలో తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సోయాబీన్స్ ని తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజర్ ఆయిల్ స్థాయిలు చాలా తగ్గుతాయి. దీనివల్ల రక్తం శుద్ధి చేయబడి రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడవు. గుండెను పది కాలాలపాటు పదిలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సోయాలో ఆంటీ ఇన్ఫ్లమెంటరీ ఆల్ అధికంగా ఉంటాయి. సోయాని తీసుకోవడం వల్ల కొల్ల జెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కొల్లాజన్ చర్మం ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీనివల్ల చర్మం ముడతలు రావు, త్వరగా వృద్ధాప్యం రాదు, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మహిళలు ప్రతిరోజూ ఈ సోయాబీన్ ని ఆహారంగా చేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్లు వంటి ప్రమాదం నుంచి తాము రక్షించుకోవచ్చు. సోయాబీన్ ఆంటీ క్యాన్సర్ ఏజెంట్ పనిచేస్తుంది. ఇది ఈస్ట్రోజన్ స్థాయిలను రెగ్యులర్ చేస్తాయి. అలాగే సోయాబీన్స్ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే టైప్ టు డయాబెటిస్ వంటి వాటి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సోయాబీన్స్ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లు స్థాయిలు స్థిరంగా ఉంటాయి. సోయాబీన్ ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇది నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే సోయాబీన్ పానీయాలలో ఐసో ప్లేవోన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది ముఖ్యంగా జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ సోయాబీన్ని తినడం వలన జుట్టు యొక్క కుదుళ్ళ భాగం నుంచి బలంగా మారుతుంది. సోయాబీన్ని తినడం వలన అధిక బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సోయాబీన్ రక్తం లోని చెడు కొలెస్ట్రాలను, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. సోయాబీన్ ని తినడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళనను తగ్గించుకోవచ్చు. మంచి నిద్రను పొందవచ్చు. కావున నిద్రలేని సమస్య కూడా దూరమవుతుంది. అలాగే సోయాబీన్స్ వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోఫాస్ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఇటువంటి సమయంలో మహిళలు సోయాబీన్ ఉత్పత్తులను తినడం చాలా ఉత్తమం.

ఈ సోయాబీన్లు పరిమాణంలో పెద్దవిగా, రొటీన్లలో ఎక్కువగా మరియు ఫీల్డ్ రకాల కంటే నూనె తక్కువగా ఉంటాయి. టోపు, సోయా పాలు మరియు సోయా సాస్ సోయాబీన్లను ఉపయోగించి తయారు చేయబడిన టాప్ తినదగిన వస్తువులలో ఉన్నాయి.

పోషణ:

సోయాబీన్ చిక్కుల జాతికి చెందినవి. ఈ సోయాబీనులో పోషణ 100 గ్రాముల ముడి, సోయాబీన్స్ 1,866 కిలో జోల్స్ ,( 446 కిలో క్యాలరీలు ) ఆహార శక్తి సరఫరా చేస్తుంది. 9% నీరు, 30% కార్బోహైడ్రేట్లు, 20% మొత్తం కొవ్వు మరియు 30% ప్రోటీన్లు. వేరుశనగ మాత్రమే అధిక కొవ్వు పదార్ధం (48%). మరియు క్యాలరీల సంఖ్య (2,385kg) కలిగిన చిక్కుళ్ళు. వాటిల్లో తక్కువ కార్బోహైడ్రేట్లు 21%, ప్రోటీన్లు 21% మరియు డైటరీ ఫైబర్ 9% ఉంటాయి

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది