Health Benefits : దివ్య ఔషధం లాంటి ఈ తీయటి తులసి.. మధుమేహం, క్యాన్సర్ నుండి ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది..!!
Health Benefits ; హిందూ సాంప్రదాయాలలో తులసిని పూజించడం ఆచారం. ఈ తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది.దీనిని ఆరాధించడమే కాకుండా ఔషధాల తయారీలో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటారు. కరోనాకాలంలో తులసి ప్రజలను చాలా కాపాడింది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసిని అధికంగా వాడుతూ ఉంటారు. తులసి గురించి మనందరికీ తెలిసిన విషయమే అయితే మధురమైన తులసి గురించి మీకు తెలుసా..? దీని రుచి ద్వారానే దానికి ఆ పేరు పెట్టారు. ఈ తులసి చెక్కర తీపి కంటే 300 రెట్లు మధురంగా ఉంటుంది. ఈ తులసి పేరు స్టేవియా ఇది ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రుచిలో కూడా అంతే గొప్పగా ఉంటుంది. తీపి తులసి చాలా ఖరీదైనది.. ఇది ఎన్నో తీవ్రమైన వ్యాధులలో తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అలాగే దీని వినియోగం శరీరాన్ని బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ మధురమైన తులసి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారికి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కూడా సహాయకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్వీట్లు తినడానికి ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం. ఈ తీపి తులసి వాస్తవానికి పొద్దుతిరుగుడు కుటుంబానికి చెందింది. ఇది సుమారు 25 జాతులకి చెందినవి. ఇది ముఖ్యంగా అమెరికాలోని ఎన్నో ప్రాంతాలలో ఉంటుంది. ఈ తులసి వాడడం వలన ఎటువంటి లాభాలు పొందవచ్చు ఇప్పుడు మనం చూద్దాం… కడుపుకి చలవ చేస్తుంది: ఈ తులసి జీర్ణ సమస్యలను తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపునొప్పి లాంటి సమస్యలను తగ్గించడానికి ఈ తీపి తులసి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ తులసి ఆకులను మరగబెట్టి దాని రసాన్ని నిత్యం తీసుకోవాలి. దానిని తీసుకోవడం వలన పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. ఈ తులసి బరువుని తగ్గిస్తుంది: బరువు పెరగడం వలన ఇబ్బంది పడుతూ ఉంటే సహజంగా బరువు తగ్గాలని అనుకుంటే.. మీ ఆహారంలో ఈ తులసిని చేర్చుకోవాలి. ఇది సహజ స్వీట్నర్ ఇది ప్రాసెస్ చేయకూడదు. పరిశోధన ప్రకారం తీపి చక్కర కంటే చాలా ఎక్కువ.అయితే దానిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు సహజంగా బరువు తగ్గాలంటే ఈ తీపి తులసిని తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకి మేలు చేస్తుంది: ఈ తులసిని చాలా సంవత్సరాలుగా స్వీట్నర్గా వినియోగిస్తున్నారు. తీపిగా ఉన్నప్పటికీ ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకి సహాయపడుతుంది. దీని వాడకం వలన మధుమేహం వ్యాధిగ్రస్తులలో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
అలాగే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ పై ఈ తీపి తులసి ప్రభావం తక్కువగా చూపుతుంది. మధుమేహం వ్యాదిగ్రస్తులకు కార్బోహైడ్రేట్స్ నియంతరణ ఆహారం తీసుకునే వారికి సహజ స్వీట్నర్ గా ఉపయోగపడుతుంది.. చర్మానికి ప్రయోజకరం: చర్మ సమస్యలను నివారించడానికి కూడా ఈ తీపి తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎగ్జిమా, డెర్మటైటిస్ లాంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తీపి తులసి బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: ఈ తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ తులసిలో టానిన్లు, కేఫినల్ యాసిడ్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిపై సానికూల ప్రభావాన్ని చూపుతుంది..