Health Benefits : రోడ్ల పక్కన ఉండే ఈ మొక్క గురించి మీకు తెలిస్తే.. అస్సలు దాన్ని వదలరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : రోడ్ల పక్కన ఉండే ఈ మొక్క గురించి మీకు తెలిస్తే.. అస్సలు దాన్ని వదలరు…

Health Benefits : పల్లెటూర్లలో దారుల పొడవునా, అలాగే పొలాల దగ్గర, ఇలా ఉండే మొక్కలలో ఒక మొక్క తలంబ్రాల మొక్క, అయితే ఈ మొక్కకు ఇంకొక పేరు అత్త కోడలు మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు రోడ్ల పక్కన బాగా ఉంటాయి. ఈ మొక్కను చూసి ఏదో పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాం. ఈ మొక్కలలో చాలా రకాలు ఉంటాయి. ఈ మొక్కకు పూలు వస్తాయి అవి రకరకాల రంగులతో పూస్తూ ఉంటాయి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,3:00 pm

Health Benefits : పల్లెటూర్లలో దారుల పొడవునా, అలాగే పొలాల దగ్గర, ఇలా ఉండే మొక్కలలో ఒక మొక్క తలంబ్రాల మొక్క, అయితే ఈ మొక్కకు ఇంకొక పేరు అత్త కోడలు మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలు రోడ్ల పక్కన బాగా ఉంటాయి. ఈ మొక్కను చూసి ఏదో పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాం. ఈ మొక్కలలో చాలా రకాలు ఉంటాయి. ఈ మొక్కకు పూలు వస్తాయి అవి రకరకాల రంగులతో పూస్తూ ఉంటాయి. అయితే ఈ మొక్కను ఒకప్పుడు ఆయుర్వేదంలో బాగా వాడే వారట, దీనిని చాలా రకాల వ్యాధులకు వాడేవారట, ఈ తలంబ్రాల మొక్క లో ఔషధ గుణాల గురించి, అలాగే ఉపయోగాల గురించి ఇప్పుడు చూద్దాం…

దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అలాగే యాంటీ మైక్రో, యాంటీసెప్టిక్ లాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అయితే ఎలాంటి దెబ్బలు తగిలిన, కానీ ఈ ఆకులు మెత్తగా పేస్ట్ చేసుకుని దెబ్బలపై పెట్టడం వలన, దెబ్బలు చాలా తొందరగా తగ్గిపోతాయి. అలాగే విషపూరితమైన జంతువులు కరిచినప్పుడు, ఈ ఆకుల రసాన్ని ఆ ప్రదేశంలో పెట్టినట్లయితే విష ప్రభావం తొందరగా తగ్గిపోతుంది.
ఈ మొక్క ఆకులకు ఆముదాన్ని రాసి వాటిని మంటపై ఉంచి తరువాత నొప్పులు ఉన్న ప్రదేశంలో పెట్టి కట్టు కట్టుకోవడం.

Health Benefits of Talambralu Chettu

Health Benefits of Talambralu Chettu

వలన, ఆ నొప్పులు నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ ఆకులను నీటిలో వేసి, ఉడకబెట్టి వీటిని ఆవిరి పట్టడం వలన, శ్వాస కోసం వ్యాధులతో ఇబ్బంది నుంచి తొందరగా బయటపడతారు. అలాగే ఇంట్లో దోమలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఈ ఆకుల పొగ వేయడం వలన, దోమల బెడద తగ్గిపోతుంది. అలాగే ఈ మొక్కలను బుట్టలు, చిన్నచిన్న వస్తువులు అల్లికలలో వీటిని బాగా వాడుతూ ఉంటారు. అలాగే ఈ మొక్క అనారోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అని అంటున్నారు. వైద్యరంగం,

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది