Tamarind leaves : చింత చిగురుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా .. ముఖ్యంగా ఈ సమస్యలకు..???
Tamarind leaves : చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింతచిగురుని ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రాలో వివిధ రకాల వంటకాలలో వేసి చేస్తారు. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చింతచిగురును ఎండబెట్టి కూడా వంటల్లో ఉపయోగిస్తారు. చింత చిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చింత చిగురుకు […]
ప్రధానాంశాలు:
Tamarind leaves : చింత చిగురుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా .. ముఖ్యంగా ఈ సమస్యలకు..???
చింత చిగురు ప్రయోజనాలు
Tamarind leaves : చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింతచిగురుని ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రాలో వివిధ రకాల వంటకాలలో వేసి చేస్తారు. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చింతచిగురును ఎండబెట్టి కూడా వంటల్లో ఉపయోగిస్తారు. చింత చిగురు పప్పు, చింతచిగురు రొయ్యలు, చింత చిగురు చికెన్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చింతచిగురు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
చింత చిగురుకు కామెర్లను నయం చేసే గుణం ఉంటుంది. చింతచిగురు నుంచి రసాన్ని తీసే అందులో పటిక బెల్లం కలుపుకొని త్రాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చు. చింతచిగురును తీసుకోవడం వలన వాతం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మూల వ్యాధులనుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. చింతచిగురును తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు నొప్పి సమస్యలకు కూడా చింతచిగురును ఉపయోగించవచ్చు.
చింతచిగురును నీటిలో మరిగించి వేడిగా ఉన్నప్పుడు నోటిలో వేసుకొని పుక్కిలించడం వలన గొంతు నొప్పి, గొంతువాపు, గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే చింతచిగురును తినటం వలన కడుపులో నులిపురుగులు కూడా నశిస్తాయి. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా చింతచిగురును తినవచ్చు. చింతచిగురు థైరాయిడ్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. చింతచిగురులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకుంటే వెంటనే జీర్ణం అవుతుంది. దీంతో గ్యాస్ మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. అలాగే రక్తహీనతతో బాధపడేవారు చింత చిగురు కచ్చితంగా తీసుకోవాలి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఇది మంచి బలాన్ని ఇచ్చే ఆకుకూర.