Thati Burra Gujju : ఈ పండు కార్తీక మాసంలో స్పెషల్… అదేమిటో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Thati Burra Gujju : ఈ పండు కార్తీక మాసంలో స్పెషల్... అదేమిటో తెలుసా...!!
Thati Burra Gujju : తాటి చెట్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కల్పవృక్షం అని ఎందరో కవులు ఎన్నో సందర్భాలలో చెప్పారు. అలాగే తాటి పిండి దశలో కళ్ళును, రెండవ దశలు రుచికరమైన ముంజలను, మూడవ దశలో అమోఘమైన సువాసనతో కూడినటువంటి రుచికరమైన తాటి పండ్లను, చివరి దశలో తాటి బుర్ర నుండి రుచికి రుచి ఎన్నో పోషకలకు ఘని అని చెప్పొచ్చు. అందుకే పల్లెటూరు వాసులకు ఏడాదికి ఒకసారి దొరికే ఈ పోషకాల ఘని ని అసలు వదలకుండా తింటారు. అయితే ఈ బుర్ర గుజ్జులో తక్కువ కేలరీలు ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అని అంటున్నారు. అలాగే ఈ తాటి బుర్ర గుజ్జు తీపిలో తక్కువ మరియు కమ్మదరం ఎక్కువగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తు కూడా వీటిని తీసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు…
పల్లెటూర్లలో నాగుల చవితి వచ్చింది అంటే చాలు తెగలతో పాటు తాటి బుర్ర గుజ్జులు కూడా అమృతంలా లాగించేస్తూ ఉంటారు. అలాగే పూర్వికులు ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడని బుర్ర గుజ్జులు తినడం వల్లే నూటికి నూరేళ్లు ఆరోగ్యంగా బతికే వారు అని మన పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అలాగే ప్రస్తుత పల్లెటూరు వాసులకు దొరికే అమృతం లాంటి ఈ తాటి బుర్రగుజ్జు ఈ మధ్యకాలంలో హైవేల పక్కన అమ్మడం విశేషంగా మారింది. అలాగే సంవత్సరానికి ఒకసారి దొరికే ఈ తాటి బుర్ర గుజ్జు తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
పల్లెటూర్లలో అయితే పొలం గట్లపై వేసిన తాటికాయలు బుర్ర గుజ్జులు గా మారి తర్వాత తెగలుగా విక్రయిస్తూ ఉంటారు. ఈ బుర్ర గుజ్జులో పోషకాలు అధికంగా ఉండడం వలన వారానికి ఒకసారి గాని లేక వారానికి మూడు రోజులు గాని తీసుకున్నట్లయితే శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయి అని నిపుణులు అంటున్నారు. వీటితో చాలా ప్రయోజనాలు ఉండడం వలన వీటిని కచ్చితంగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు