Health Benefits : ఈ గోధుమ గడ్డి జ్యూస్ రోజు తాగితే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ గోధుమ గడ్డి జ్యూస్ రోజు తాగితే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Health Benefits : గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.. ఈ గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గోధుమ గడ్డిలో బీ కాంప్లెక్స్, విటమిన్ ఏ, సి, కె తో పాటు మెగ్నీషియం ఫైటో న్యుట్రుమెంట్ ఏమైనా క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ గోధుమ గడ్డిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 February 2023,3:00 pm

Health Benefits : గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.. ఈ గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గోధుమ గడ్డిలో బీ కాంప్లెక్స్, విటమిన్ ఏ, సి, కె తో పాటు మెగ్నీషియం ఫైటో న్యుట్రుమెంట్ ఏమైనా క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ గోధుమ గడ్డిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జీర్ణక్రియ మెరుగుపడుతుంది : గోధుమ గడ్డిలో ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడతాయి.

Health Benefits of Wheat grass juice

Health Benefits of Wheat grass juice

2011లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం గోధుమ గడ్డి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. అలాగే అజీర్తి, కడుపుబ్బరం లాంటి సమస్యలను తగ్గిస్తాయి. వీట్ గ్రాస్ మలబద్దకం లాంటి జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తాయి.. ఆర్తోరైటీస్ సమస్యలు కు చెక్.. గోధుమ గడ్డిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ఆర్థరైటిస్ కారణంగా వచ్చే బోన్ స్టిఫ్నెస్ నొప్పి వాపులాంటి లక్షణాలనుంచి బయటపడేస్తుంది. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ ఇంప్లమేషన్ను తగ్గిస్తుంది.. అధిక బరువు తగ్గుతారు ; ఈ గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ గోధుమ గడ్డి జ్యూస్ షుగర్ కొవ్వు అధికంగా

Health Benefits of Wheat grass juice

Health Benefits of Wheat grass juice

ఉండే ఆహారాలు పట్ల కోరికను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. క్యాన్సర్ కు చెక్ : గోధుమ గడ్డి జ్యూస్ క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేస్తాయి. టెస్ట్ ట్యూబ్ పరిశోధన లో ప్రకారం గోధుమ గడ్డి క్యాన్సర్ ను చంపడానికి క్యాన్సర్ అభివృద్ధిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక మానవ పరిశోధనలు ఇది కీమోథెరపీ చెడు ప్రభావాలను తగ్గిస్తుందని తేలింది.. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది : గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటేక్స్ చేస్తుంది. 2015లో జరిగిన పరిశోధన ప్రకారం గోధుమ గడ్డిలోని పోషకాలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన కాలేయ పనితీరులకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది ; గోధుమ గడ్డి జ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా కరిగిస్తుంది. 2010 పరిశోధన ప్రకారం ఇది బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచి గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది