Health Benefits : ఈ అరుదైన ఆకుతో…ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టవచ్చు…
Health Benefits : ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే పరిమితికి మించి ఆహారం తీసుకోవడం, బయట దొరికే ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన బరువు పెరుగుతున్నారు. ఇలా ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడి బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే తినే ఆహార పదార్థాలలో పోషకాహార లోపం వలన లివర్ సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే ఈ ఆధునిక కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా కంటిచూపు బాగా తగ్గిపోతుంది. దీనికి కారణం టెలివిజన్లు, మొబైల్స్ ను ఎక్కువగా చూడడం. అయితే ఈ మూడు సమస్యలకు ఈజీగా ఒక ఆకుతో చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఆకును తినడం వలన ఈ మూడు సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఇప్పుడు ఆకు ఏంటో, దాని వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం..
ఇప్పుడు మన మార్కెట్లో విదేశీ కూరగాయలు కూడా దొరుకుతున్నాయి. అందులో ఒకటే కాలే ఆకు కూర. ఇది పెద్ద పెద్ద ఫుడ్ స్టాల్స్ లో ఎక్కువగా లభిస్తుంది. దీనిని ఆకుకూర లాగా వండుకోవచ్చు. ఈ కాలే ఆకు ధర 100 గ్రాములు, 50 రూపాయలు ఉంటుంది. ఈ ఆకులలో కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములు ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ 3.3 గ్రాములు, ఫ్యాట్స్ 0.8 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు ఉంటాయి. అలాగే పొటాషియం 447 మిల్లీగ్రాములు, సోడియం 43 మిల్లీ గ్రాములు, క్యాల్షియం 135 మి. గ్రా. ,విటమిన్ ఏ 2870 మైక్రోగ్రామ్స్, విటమిన్ సి 94 మిల్లీగ్రాములు, విటమిన్ కే 390 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ పోషకాలు అన్ని మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాలే ఆకులను కొత్తిమీర లాగా పైన చల్లుకొని ఉపయోగించుకోవచ్చు. సలాడ్స్ లో జ్యూస్ లాగా వాడుకోవచ్చు.
కాలే ఆకులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి కణజాలం లోపల డీఎన్ఏ డ్యామేజ్ కాకుండా రక్షించడానికి, కాన్సర్ కణాలు ఉత్పత్తి చెందకుండా చూస్తుంది. అంతేకాకుండా దీర్ఘ రోగాలు అయిన ఆటో ఇమ్యూన్ డిసార్డర్ రాకుండా ఉండడానికి ఈ ఆకులు బాగా సహాయపడతాయి. అలాగే కాలే ఆకులో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. రక్తం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ఆకులో ఉండే విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి, ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ కాలే ఆకులో బయల్ ఆసిడ్ సీక్వెన్ టెడ్ అనే కెమికల్ ఉండడం వలన మనం తిన్న ఆహారంలో కొవ్వులు రక్తంలోకి, లివర్ లోకి వెళ్లకుండా ఆపుతాయి. అలాగే కొవ్వులను పేగుల నుంచి తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిద్వారా ఫ్యాటీ లివర్స్ రాకుండా సహాయపడుతుంది.