Health Benefits : ఈ రెండింటిని మిక్స్ చేసి తీసుకుంటే.. అధిక బరువుకి చెక్..
Health Benefits : అధిక బరువు.. ఈ రోజుల్లో చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఊబకాయంతో బాధపడుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంతో చిన్న వయసులోనే పెద్ద పొట్టలేసుకొని తిరుగుతున్నారు. శరీరంలో పెరిగిన కొవ్వును, అధిక బరువును తగ్గించుకోవటానికి కఠినమైన డైట్, వ్యాయమాలు చేయడం చాలా కష్టతరం. కాగా అధిక బరువుతో గుండె నొప్పి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలతో భాదపడుతుంటారు. అయితే అధిక బరువును కొన్ని చిట్కాలతో సహజంగా ఎలా తగ్గించుకోవలో ఇప్పుడు చూద్దాం..వంటింట్లో ఉండే వాము అధిక బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అవసరం లేని కొవ్వును కరిగిస్తుంది.
వాములోని జీర్ణ శక్తి గుణాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గించడంలో కరివేపాకు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కరివేపాకు అందరి ఇళ్లల్లో సులభంగానే అందుబాటులో ఉంటుంది. దాదాపు ప్రతి రోజు మనం కూరల్లో వాడతాం.కాగా రెండు స్పూన్ల వాముని తీసుకుని పాన్లో వేడి చేయాలి. కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇందులో వేయడానికి కరివేపాకు ఆకులు ఎండలో ఆరబెట్టాలి. ఈరెండింటిని మిక్స్ లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను గ్లాస్ వాటర్ లో కలిపి రెగ్యూలర్ గా తాగాలి. కావాలనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. కానీ బీపీ పెషెంట్లు ఉప్పును వేసుకోవద్దు.
Health Benefits : వాము.. కరివేపాకులో అద్భుత ఔషద గుణాలు
దీంతో బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి శరీరం అందంగా తయారవుతుంది. నెల రోజుల పాటు ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అయితే ఈ పొడితో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలి. యోగా లేదా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు.కాగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, ఈ, కే, బీలు ఉంటాయి. అలాగే, డైటరీ ఫైబర్, కాపర్, క్యాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. తద్వారా అధిక బరువును తగ్గిస్తాయి.