Health Benefits : ఈ ఆకుల్లో ఉన్న మ్యాజిక్ తెలిస్తే… అసలు వదలరు… వ్యాధులన్నీ పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ ఆకుల్లో ఉన్న మ్యాజిక్ తెలిస్తే… అసలు వదలరు… వ్యాధులన్నీ పరార్…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2025,11:00 am

Health Benefits : ప్రకృతి ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఎన్నో ఇచ్చింది. దీని నుంచి తయారుచేసిన ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఔషధ గుణాలు కలిగిన చెట్టు మునగ చెట్టు. చెట్టు, ఆకులు, పండ్లు పువ్వులు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మునగాకులలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆకులను తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకున్నట్లయితే బరువు త్వరగా తగ్గవచ్చు. ఇంకా జీర్ణ సమస్యలను కూడా నివారించవచ్చు. మునగా ఆకులను తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకుందాం…
మునగాకులలో ఏ,సి, ఈ, కే,బి బి1, బి2, బి3 కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ప్రోటీన్,ఫైబర్ వంటి అనేక విటమిన్ లో పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, అరటి పండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయి. 2023 లో NCBI జర్మన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మునగ ఆకులను, గాయాలు నొప్పి, పూతల, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వాపులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

Health Benefits ఈ ఆకుల్లో ఉన్న మ్యాజిక్ తెలిస్తే అసలు వదలరు వ్యాధులన్నీ పరార్

Health Benefits : ఈ ఆకుల్లో ఉన్న మ్యాజిక్ తెలిస్తే… అసలు వదలరు… వ్యాధులన్నీ పరార్…?

Health Benefits రోగరోధక శక్తి పెరుగుతుంది

ఆకుల్లో విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ లో వ్యాధులతో పోరాడడానికి సహకరిస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించుటకు ఈ ఆకులో ఎంతో ముఖ్యపాత్రను పోషిస్తాయి.

రక్త పోటును నియంత్రించుటకు : మునగ ఆకులలో ఫైటో కెమికల్స్ రక్తనాళాలు ఒత్తిడిని తగ్గించి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహకరిస్తుంది. ప్రాంటీయర్స్ జనరల్ లో ప్రచురించబడిన 2022 అధ్యయనంలో మునగాకుల్లో రక్తపోటును సహాయ పడే సమ్మేళనాలు ఉన్నాయని కనుగొన్నారు.మునగాకులను తిన్న రెండు గంటల్లోనే అధిక రక్తపోటు తగ్గింది అన్నట్టు 2021 అధ్యయనంలో తేలింది.

డయాబెటిస్ నియంత్రణ : క్లోరోజనిక్ ఆమ్లం రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపకరిస్తుంది. NCBI జనరల్ లో ప్రచురించబడిన 2021 అధ్యయనాల ప్రకారం ఇది రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచడంలో రక్తంలో చక్కెర స్థానం తగ్గించడానికి దీర్ఘకాలిక మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

జీర్ణ మెరుగుపరుస్తుంది : ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.కాబట్టి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం,జీర్ణం,అల్సర్ వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేమ కదలికలకు దోహదపడుతుంది.

ఎముకలను బలోపేతం చేయడం : ఈ ఆకులలో క్యాల్షియం,భాస్వరం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల్లో బలపరుస్తుంది ఇందులో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులను నివారించగలదు.

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు : ఫ్లెవనాయిడ్స్,ఫినాలిక్ సమ్మేళనాలు, పాలిఫైనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కీళ్ల నొప్పులు : ఆకులలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహకరిస్తుంది ఎముకలను బలోపేతం.

చర్మం, జుట్టు ఆరోగ్యం :మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం చేత వృద్ధాప్య సంకేతాలు తో పోరాడుతాయి. మునగాకుల్లో ఉండే విటమిన్ ఏ ఈ మొటిమలను తగ్గిస్తుంది.చర్మాన్ని మృదువుగా చేస్తుంది.జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది