Ragi Hava Benifits : రోజూ ఈ జావ తాగితే తాగితే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.. తెలుసుకోండిలా..?
Ragi Hava Benifits : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చీటికి మాటికి అనారోగ్యం బారిన పడుతుంటారు. కారణం వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు లేకపోవడమే అని తెలుస్తోంది. మంచి బలమైన ఆహారం తీసుకుంటే అనారోగ్యం దరిచేరదు. ప్రస్తుతం బయట దొరికే చాలా ఫుడ్స్ కలుషితం అవుతున్నాయి. కల్తీ ఆయిల్స్ వాడటం వలన 60లలో రావాల్సిన దీర్ఘకాలిక వ్యాధులు 30లలోనే అటాక్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ మధ్య కాలంలో వైద్యులు రాగి జావ (మిల్లెట్స్ జ్యూస్) తాగాలని సలహా ఇస్తున్నారు. ఇది మన శరీరానికి అవసరమయ్యే శక్తితో పాటు అన్ని ప్రోటీన్లను అందిస్తుంది. బలవర్ధక మైన ఆహార జాబితాలో రాగి జావ నంబర్ వన్ స్థానంలో ఉంది.
Ragi Hava Benifits : రాగి జావ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు
రాగి జావ తీసుకోవడం వలన బోలెడు ప్రయోజనాలున్నాయి. సీజన్లతో సంబంధం లేకుండా ఈ జావను ఆహారంలా తీసుకోవచ్చు. చలికాలంలో తీసుకుంటే శరీరంలో తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది. వేసవిలో మాత్రం కొంచెం తక్కువగా తీసుకోవాలి. శరీరంలో అధికవేడి ఉత్పత్తి అవుతే వేడి చేస్తుంది. రాగి జావలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివలన జీర్ణ సమస్యలు మరియు మలబద్దకం తగ్గుతుంది.
రాగి జావలో ఫైబర్, అమైనో ఆమ్లాలు, పాలిపినాల్స్ వంటి ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇది తీసుకోవడం వలన డయాబెటీస్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. రాగుల్లో గ్లెసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా డుటం వలన ఇది షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అధిక బరువుతో బాధపడే వారికి రాగి జావ బెస్ట్ మెడిసిన్. రక్తంలోని కోలెస్టరాల్‌ను తగ్గించి నియంత్రణలో ఉంచుతుంది. రక్తపోటు కూడా నియత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు దూరం అవుతాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. రక్తహీనత తగ్గి నాడీ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఎముకలు ధృడంగా మారి కండరాలు గట్టిగా అవుతాయి. దీనిని ఎలా చేయాలంటే.. గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసి మరిగించాలి. అందులో రెండు చెంచాల రాగి పొడిని పోసి బాగా కలుపుకోవాలి. కొంచె సాల్ట్ వేసుకోవాలి. 5నిమిషాలు వేడి చేశాక దింపేసి చల్లారాక తాగాలి. ఇందులో మజ్జిగ కూడా కలుపుకుని తాగొచ్చు.