Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 13 January 2026, 11:50 pm
  •  Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..! సంక్రాంతికి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా ‘అనగనగా ఒక రాజు’.. నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో హిట్ ఫిక్స్?

  •  Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో కొన్ని భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా, జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిలో నవీన్ పోలిశెట్టి Naveen Polishetty ,  మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary జంటగా నటించిన ‘ అనగనగా ఒక రాజు ’ Anaganaga Oka Raju Movie పై భారీ అంచనాలు నెలకొన్నాయి.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు ‘భీమవరం బాలుమ’ పాటకు మంచి స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే?

ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం, ‘అనగనగా ఒక రాజు’ పూర్తిగా ఫన్ రైడ్‌లా ఉండబోతోంది. కథ సింపుల్‌గా ప్రారంభమై, ప్రతి కొద్ది నిమిషాలకో హిలేరియస్ కామెడీ సన్నివేశంతో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుందట. సినిమా మొత్తం ఎక్కడా బోర్ అనిపించకుండా నవ్వులు పూయిస్తుందని టాక్.

Anaganaga Oka Raju Movie Review నవీన్ పోలిశెట్టి కామెడీ మరోసారి హైలైట్

నవీన్ పోలిశెట్టి తన నేచురల్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకుంటారని అంటున్నారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బుల్లి రాజు (చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్)తో పాటు ఒక డాగ్‌తో వచ్చే ఎపిసోడ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట.

Anaganaga Oka Raju Movie Review  హీరోయిన్ పాత్రకూ మంచి ప్రాధాన్యం

హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా గ్లామర్‌తో పాటు కామెడీ టైమింగ్‌లో మెప్పించిందని సమాచారం. ఆమె పాత్రకు కథలో సరైన వెయిట్ ఉండటంతో పాటు, గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్ సంక్రాంతి ఫీలింగ్‌ను మరింత బలపరుస్తుంది.

ఇంటర్వెల్ – క్లైమాక్స్ పక్కా ప్లాన్

సుమారు 2 గంటల 30 నిమిషాల రన్‌టైమ్తో రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారని టాక్. ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ అన్నీ సరైన మోతాదులో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది మంచి ట్రీట్ అవుతుందని భావిస్తున్నారు.

ఓవరాల్‌గా…

ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ అసలైన విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు

Anaganaga Oka Raju Movie Review , Anaganaga Oka Raju First Review, Anaganaga Oka Raju Rating, Naveen Polishetty New Movie Review , Sankranti Movies 2026 Telugu , Anaganaga Oka Raju Public Talkఅనగనగా ఒక రాజు మూవీ రివ్యూ , అనగనగా ఒక రాజు ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ , నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా, అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్, సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ, నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా , సంక్రాంతి సినిమాలు 2026 , అనగనగా ఒక రాజు సినిమా ఎలా ఉంది, అనగనగా ఒక రాజు పబ్లిక్ టాక్ ,

.

క‌థ‌:

రాజు అలియాస్ నవీన్ పొలిశెట్టి ఒక జమీందారు మనవడు. కానీ ఆ జమీందారీ పేరు తప్ప చేతిలో మాత్రం ఒక్క రూపాయి ఆస్తి కూడా ఉండదు. కారణం – అతడి తాత తనకున్న ఆస్తులన్నింటినీ తన గర్ల్‌ఫ్రెండ్స్ పేర్ల మీద రాసిచ్చేసి, మనవడికి చిల్లి గవ్వ కూడా మిగల్చడు. అయినా రాజు మాత్రం “జమీందారు మనవడు” అనే ట్యాగ్‌తో రాయల్టీని మెంటైన్ చేస్తూ, ఊర్లో పెద్ద మనిషిలా తిరుగుతుంటాడు.ఒకరోజు బంధువుల పెళ్లికి వెళ్లిన రాజుకు అక్కడ ఘోరమైన అవమానం ఎదురవుతుంది. ఆ అవమానంతో రగిలిపోయిన రాజు, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకుని చూపిస్తానంటూ ఛాలెంజ్ విసురుతాడు. వెంటనే పంతులిని పిలిపించి, కోట్లకు వారసురాలైన అమ్మాయిని చూడమని ఆదేశిస్తాడు.

అదే సమయంలో గుడిలో చారులత అలియాస్ మీనాక్షి చౌదరిని రాజు చూసేస్తాడు. ఒంటి నిండా బంగారంతో దగదగ మెరిసిపోతున్న చారులతను చూసిన క్షణంలోనే, “ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెట్” అని డిసైడ్ అయిపోతాడు. తన తెలివితేటలతో చారులతను ప్రేమలో పడేసి, చివరకు ఘనంగా పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాతే రాజుకు ఒక ఊహించని నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? రాజు కలలు నిజమయ్యాయా? లేక జీవితం అతడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిందా? అన్నది తెలుసుకోవాలంటే ‘అనగనగా ఒక రాజు’ సినిమాను థియేటర్‌లోనే చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా నవ్వులకు బ్రేక్ పడకుండా నవీన్ పొలిశెట్టి ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా అతడి వన్‌లైనర్లు, పంచులు చాలా చోట్ల గట్టిగానే పేలాయి. స్క్రీన్‌పై ఎప్పటిలాగే ఎనర్జీతో, టైమింగ్‌తో నవీన్ చేసిన నటన ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. నిజానికి ఇది పూర్తిగా అతడి ఒన్‌మ్యాన్ షో అనే చెప్పాలి.హీరోయిన్ మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ ఏడాది కూడా పండగకు పలకరిస్తూ చారు పాత్రలో కనిపించింది. పాత్రకు తగ్గట్టుగా ఆమె నటన బాగానే కుదిరింది. గ్లామర్‌తో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ ఓకే అనిపించింది.

కనిపించిన సమయం తక్కువే అయినా రావు రమేష్ తన పాత్రతో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పండించారు. అలాగే మహేష్ ఆచంట, ముక్కు అవినాష్, ఝాన్సీ తదితర పాత్రలు అవసరమైన చోట నవ్వులు పూయించాయి. విలన్ పాత్రలో తారక్ పొన్నప్ప కూడా తనకు ఇచ్చిన స్కోప్ మేరకు బాగానే నటించాడు. అయితే మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ భారాన్ని నవీన్ ఒంటిచేత్తో మోసినట్టుగా అనిపిస్తుంది. మిక్కీ జే మేయర్ అందించిన పాటల్లో “భీమవరం బాల్మా” ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఫర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే, ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp