Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Nari Nari Naduma Murari Movie : నారి నారి నడుమ మురారి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, యువ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. భాను భోగవరపు కథ అందించగా, నందు సావిరిగన డైలాగ్స్ రాశారు. జీ శేఖర్, యువరాజ్ సినిమాటోగ్రఫీ చేయగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Nari Nari Naduma Murari Movie Review : సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి
ఇటీవల ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సినిమాలోని కొన్ని అడల్ట్ ఫ్లేవర్ ఉన్న డైలాగ్స్, సన్నివేశాలపై సెన్సార్ బోర్డు స్వల్ప అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, అధికారుల సూచనల మేరకు అవసరమైన మార్పులు చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఎలాంటి వివాదాలు లేకుండా సెన్సార్ పూర్తయింది.
Nari Nari Naduma Murari Movie Review : యూఏ సర్టిఫికెట్, క్రీస్పీ రన్‌టైమ్
ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కుకున్న యువకుడి పాత్రలో శర్వానంద్ నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ (UA 13+) సర్టిఫికెట్ జారీ చేసింది. 13 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమా వీక్షించవచ్చు. 13 ఏళ్లకు తక్కువ వయసున్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది.ఇక కథను అనవసరంగా సాగదీయకుండా చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సినిమా నిడివిని *2 గంటల 25 నిమిషాలు (145 నిమిషాలు)గా ఖరారు చేశారు. దీంతో సినిమా క్రీస్పీగా, ల్యాగ్ లేకుండా సాగుతుందని భావిస్తున్నారు.
Nari Nari Naduma Murari Movie Review సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్
యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా రూపొందిన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. శర్వానంద్ మరోసారి సంక్రాంతి బరిలో ఎంటర్‌టైనర్‌తో దూకుతుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.