Eating Too Many Dates : ఆరోగ్యానికి మంచివే కదా అని ఖర్జూరాలను తెగ తినేస్తున్నారా?
Eating Too Many Dates : ఖర్జూరం అనగానే చాలామందికి నోరూరుతుంది. ఎందుకంటే ఖర్జూరం అంత తియ్యగా ఉంటుంది కాబట్టి. ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఒక్కటయినా ఖర్జూరం తినండి అని చాలామంది చెబుతుంటారు. అది నిజమే కానీ.. కొందరైతే ఖర్జూరాలు ఆరోగ్యానికి మంచివే కదా అని చెప్పి వీటిని అతిగా తింటూ ఉంటారు. రోజూ ఒక్కటి తింటే ఓకే కానీ.. అతిగా తింటే అవే అనారోగ్యానికి దారి తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
అసలు ఖర్జూరంలో ఏముంటుందో తెలుసా? ఫైబర్ ఉంటుంది.. పొటాషియం, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ బాడీలో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి కానీ.. ఎక్కువైతే ప్రమాదమే. అందుకే వాటిని మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
Eating Too Many Dates : ఖర్జూరంలో కేలరీలు ఎక్కువ
ఖర్జూరంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ కేలరీల వల్ల శరీరంలో కొవ్వు పెరిగి చివరకు ఊబకాయానికి దారి తీస్తుంది. ఖర్జూరం తియ్యగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకుంటే షుగర్ లేవల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలను ఎక్కువగా తిన్నా వాళ్లలో హైపో గ్లైసోమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.. మలబద్ధకం పెరుగుతుంది. అందుకే ఖర్జూరాలను మితంగా తీసుకుంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.